Son OF Movie : తండ్రి మీదే కేసు వేసిన కొడుకు.. ఓటీటీలోకి వచ్చిన ‘సన్ ఆఫ్’ సినిమా..
ఈ సినిమా ఫిబ్రవరి 27న థియేటర్స్ లో విడుదల అయింది. (Son OF Movie)
Son OF Movie
Son OF Movie : సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ పై బత్తుల సతీష్ దర్శకత్వంలో సాయి సింహాద్రి, మీరా రాజ్ జంటగా సీనియర్ నటుడు వినోద్ కుమార్ కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా ‘సన్ ఆఫ్’. ఈ సినిమా ఫిబ్రవరి 27న థియేటర్స్ లో విడుదల అయింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.
అల్లరిచిల్లరిగా తిరిగే ఓ కొడుకు తన తండ్రి మీదే కోర్టులో కేసు వేయడం, కోర్టు ఓ విచిత్రమైన తీర్పు ఇవ్వడం, హీరో లవ్ స్టోరీలో ఉండే ట్విస్ట్.. ఇలా ఆసక్తికర కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. ప్రస్తుతం సన్ అఫ్ సినిమా హనుమాన్ మీడియా సంస్థ ద్వారా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.
Also Read : Tejaswini Gowda : భర్త అమర్దీప్ తో కలిసి చార్ధామ్ యాత్ర చేస్తున్న తేజస్విని గౌడ.. ఫొటోలు..
తండ్రి పాత్రలో వినోద్ కుమార్ మంచి ఎమోషన్ ని పండించారు. క్యూట్ లవ్ స్టోరీ, లవ్ స్టోరీలో అదిరిపోయే ట్విస్ట్ తో పాటు కామెడీ కూడా ఈ సినిమాలో ఉంది.

