ARI : బాలీవుడ్ కూడా ఎదురు చూస్తున్న ‘అరి’ సినిమా.. వినోద్ వర్మ ఫస్ట్ లుక్ రిలీజ్..
బాలీవుడ్ మేకర్స్ కూడా ఆసక్తి చూపిస్తున్న 'అరి' సినిమా నుంచి వినోద్ వర్మ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

Anasuya Bharadwaj Ari Movie
ARI : ‘పేపర్ బాయ్’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపుని సంపాదించుకున్న ‘జయశంకర్’.. ఇప్పుడు ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన సినిమా ‘అరి’. ఇక ఈ టైటిల్ కి ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనే ఆసక్తికర సబ్ టైటిల్ ని పెట్టారు. సుమన్, ఆమని, సాయికుమార్, శుభలేఖ సుధాకర్, అనసూయ, సురభి ప్రభావతి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే ఇతర ఇండస్ట్రీ మేకర్స్ నుంచి రీమేక్ రైట్స్ కోసం ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన క్యారెక్టర్ లుక్స్, ట్రైలర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇవి చూసిన బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఈ సినిమా హిందీ రీమేక్ పై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ ఇండస్ట్రీ నుంచి శివ కార్తికేయన్ కూడా రీమేక్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
Also read : Racha Ravi : రచ్చ రవి డబుల్ మీనింగ్ డైలాగ్‌కి.. గట్టి కౌంటర్ ఇచ్చిన యాంకర్..
రిలీజ్ కి ముందే మంచి అంచనాలు క్రియేట్ చేసుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా వినోద్ వర్మ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రని వినోద్ వర్మ పోషిస్తున్నారు. ఈ లుక్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. కాగా ఈ చిత్రాన్ని ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మించారు.
ఇక ఈ మూవీ ట్రైలర్ ని చూసిన ఓ ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ.. సినిమా రిలీజ్ విషయంలో భాగస్వామి కాబోతుందని తెలుస్తుంది. ఆ వివరాలతో పాటు సినిమా విడుదల తేదీని కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.