Waltair Veerayya: వాల్తేరు వీరయ్య ట్రైలర్.. వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్!

మెగాఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మనకు వింటేజ్ చిరంజీవి తిరిగి వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి లుక్స్, సాంగ్స్ భారీ అంచనాలను క్రియేట్ చేయగా.. ఇప్పుడు ఆ అంచనాలను మించిపోయేలా చేసింది ఈ ట్రైలర్.

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య ట్రైలర్.. వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్!

Vintage Chiranjeevi Back With Waltair Veerayya Trailer

Updated On : January 7, 2023 / 6:27 PM IST

Waltair Veerayya: మెగాఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మనకు వింటేజ్ చిరంజీవి తిరిగి వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి లుక్స్, సాంగ్స్ భారీ అంచనాలను క్రియేట్ చేయగా.. ఇప్పుడు ఆ అంచనాలను మించిపోయేలా చేసింది ఈ ట్రైలర్.

Waltair Veerayya : వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మళ్ళీ మారిందా?

పక్కా మాస్.. ఊరమాస్ అవతారంలో మెగాస్టార్ పాత్ర ఈ సినిమాకే హైలైట్‌గా ఉండబోతుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ‘‘మాస్ అనే పదానికి బొడ్డుకోసి పేరెట్టిందే ఆయన్ను చూసి..’’ అంటూ మెగాస్టార్ పాత్రను ఎలివేట్ చేసిన విధానం అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించింది. ఇక ఈ సినిమాలో బాస్ కామెడీతో మరోసారి రెచ్చిపోయాడు. అందాల భామ శ్రుతి హాసన్‌తో బాస్ చేసే రొమాన్స్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో ఈ ట్రైలర్‌లోనే చూపెట్టారు. అటు మాస్ రాజా రవితేజ పాత్రను కూడా అల్టిమేట్‌గా డిజైన్ చేసింది చిత్ర యూనిట్. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ్ మాస్ ఎంట్రీ ఈ సినిమాకు మరో హైలైట్‌గా ఉండబోతుంది.

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ శాటిలైట్ రైట్స్‌కు సాలిడ్ రేటు.. ఎవరు సొంతం చేసుకున్నారంటే..?

విలన్ పాత్రలో బాబీ సింహా నటిస్తుండగా, ట్రైలర్ చివర్లో రవితేజ-చిరంజీవిల మధ్య సాగే డైలాగ్ ఈ ట్రైలర్‌ను మరింత స్పెషల్‌గా చేసింది. చిరంజీవి ఆల్‌టైమ్ డైలాగ్ ‘‘కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి’’ అంటూ రవితేజ వార్నింగ్ ఇస్తుండగా.. ‘‘సిటీకి ఎంతో మంది కమీషినర్లు వస్తుంటారు పోతుంటారు.. కానీ ఇక్కడ వీరయ్య.. లోకల్’’ అంటూ బాస్ వేసే పంచ్ అదిరింది. మాస్ అంశాలతో పాటు ఎంటర్‌టైనింగ్ కథతో వాల్తేరు వీరయ్య అభిమానులకు పూనకాలు తెప్పించేందుకు పండగకి బరిలోకి దిగుతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.