Ee Saraina : ‘ఈ సారైనా’ మూవీ రివ్యూ.. గవర్నమెంట్ జాబ్ కోసం యువకుడి ప్రయత్నం..

'ఈ సారైనా' సినిమా నవ్విస్తూనే మంచి ప్రేమ కథతో గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలనే ప్రేరణతో ఫీల్ గుడ్ గా చూపించారు.

Ee Saraina : ‘ఈ సారైనా’ మూవీ రివ్యూ.. గవర్నమెంట్ జాబ్ కోసం యువకుడి ప్రయత్నం..

Viplav Ee Saraina Movie Review and Rating

Updated On : November 8, 2024 / 8:51 PM IST

Ee Saraina Movie Review : విప్లవ్, అశ్విని జంటగా తెరకెక్కిన సినిమా ‘ఈ సారైనా’. ఈ సినిమాలో విప్లవ్ హీరోగా నటిస్తూనే దర్శకుడిగా, నిర్మాతగా, ఎడిటర్ గా తెరకెక్కించాడు. ప్రదీప్ రాపర్తి, మహబూబ్ బాషా, కార్తికేయ దేవ్, నీతు, సత్తన్న, అశోక్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సారైనా సినిమా నేడు నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ విషయానికొస్తే.. చిన్నప్పటినుంచే రాజు(విప్లవ్) శిరీష(అశ్విని)ను ప్రేమిస్తూ ఉంటాడు. పెద్దయ్యాక శిరీష గవర్నమెంట్ టీచర్ గా జాబ్ తెచ్చుకుంటుంది. విప్లవ్ మాత్రం ఎన్నిసార్లు ట్రై చేసినా ఫెయిల్ అవుతూ ఉంటాడు. విప్లవ్ కి నమ్మకం పోయినా అతని ఫ్రెండ్, అశ్విని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. జాబ్ తెచ్చుకోవట్లేదని ఊళ్ళోవాళ్ళంతా ఈసారైనా గవర్నమెంట్ జాబ్ వస్తుందా అని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇక అశ్విని తండ్రి(ప్రదీప్ రాపర్తి) గవర్నమెంట్ జాబ్ వస్తేనే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని కండిషన్ పెడతాడు. దీంతో రాజు గవర్నమెంట్ జాబ్ కొడతాడా? రాజు – శిరీష పెళ్లి అవుతుందా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Dhoom Dhaam : ‘ధూం ధాం’ మూవీ రివ్యూ.. ఫుల్ గా నవ్వుకోవాల్సిందే..

సినిమా విశ్లేషణ.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చిన్నప్పట్నుంచి ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నడిపించి పెద్దయ్యాక కూడా వాళ్ళు ప్రేమలో ఉండటం చాలా బాగా చూపించారు. గవర్నమెంట్ జాబ్ కోసం హీరో ప్రయత్నించడం, ఫెయిల్ అవ్వడం, అందరూ ఎగతాళి చేయడం మొదట కామెడీగా చూపించినా ఆ తర్వాత పెళ్లి కోసం, కొన్ని సంఘటనలతో ఎలాగైనా జాబ్ కొట్టాలని కష్టపడటం చూపించే విధానం ఇన్ స్పైరింగ్ గా ఉంటుంది. లవ్ ట్రాక్ కొత్తగా సింపుల్ గా రాసుకున్నారు. అక్కడక్కడా కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. అంతా ఆల్మోస్ట్ కొత్తవాళ్ళతోనే మంచి ఫీల్ గుడ్ సినిమా తీసారు. చైల్డ్ ఆర్టిస్ట్ లు కార్తికేయ, నీతూ మధ్య క్యూట్ లవ్ స్టోరీ బాగా చూపించారు. తక్కువ నిడివి ఉండటం సినిమాకు ప్లస్ అవుతుంది. కొన్ని సీన్స్ మాత్రం సాగదీశారు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. పల్లెటూరి యువకుడిలా, గవర్నమెంట్ జాబ్ కోసం చేసే ప్రయత్నాలలో విప్లవ్ బాగా నటించాడు. ఓ పక్క దర్శకత్వం చేస్తూనే మరో పక్క తన నటనతో మెప్పించాడు. శిరీష పాత్రలో అశ్విని అయితే హీరోయిన్ గా కాకుండా మన ఇంటి పక్క అమ్మాయిలా సింపుల్ గా కనిపించి అలరించింది. హీరోయిన్ తండ్రి పాత్రలో చేసిన ప్రదీప్ రాపర్తి మాత్రం తన నటనతో అదరగొట్టేసారు. మహబూబ్ బాషా అక్కడక్కడా నవ్వించాడు. చైల్డ్ ఆర్టిస్టులు కార్తికేయ, నీతూ క్యూట్ గా నటించి మెప్పించారు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. పల్లెటూరి లొకేషన్స్ ని బాగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫీల్ గుడ్ అనిపిస్తుంది. పాటలు వినడానికి బాగున్నాయి. ఇక ఒక మంచి లవ్ స్టోరీకి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలని ఓ మంచి జర్నీ జత చేసిన కథను సింపుల్ కథనంతో దర్శకుడిగా, హీరోగా, ఎడిటర్ గా అన్ని భాద్యతలను పర్ఫెక్ట్ గా నిర్వహించాడు విప్లవ్. మరో పక్క విప్లవ్, సంకీర్త్ చిన్న సినిమా అయినా ఎక్కడా తగ్గకుండా బెటర్ అవుట్ పుట్ ఇచ్చి నిర్మాతలుగా సక్సెస్ అయ్యారు.

మొత్తంగా ‘ఈ సారైనా’ సినిమా నవ్విస్తూనే మంచి ప్రేమ కథతో గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలనే ప్రేరణతో ఫీల్ గుడ్ గా చూపించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.