Guard : ‘గార్డ్’మూవీ రివ్యూ.. ఆస్ట్రేలియాలో సెక్యూరిటీ గార్డ్ ఏం చేసాడు?

ఈ కథ అంతా ఆస్ట్రేలియాలో జరుగుతుంది.

Guard : ‘గార్డ్’మూవీ రివ్యూ.. ఆస్ట్రేలియాలో సెక్యూరిటీ గార్డ్ ఏం చేసాడు?

Viraj Reddy Cheelam Mimi Leonard Shilpa Balakrishna Guard Movie Review

Updated On : February 28, 2025 / 3:39 PM IST

Guard Movie Review : విరాజ్ రెడ్డి చీలం, మిమీ లియానార్డ్ జంటగా తెరకెక్కిన సినిమా ‘గార్డ్’. రివెంజ్ ఫర్ లవ్ ట్యాగ్‌లైన్‌. అను ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై అనసూయ రెడ్డి నిర్మాణంలో జగ పెద్ది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శిల్పా బాలకృష్ణ కీలక పాత్ర పోషించింది. ఆస్ట్రేలియాలో తెరకెక్కించిన ఈ గార్డ్ సినిమా నేడు ఫిబ్రవరి 28న విడుదల అయింది.

కథ విషయానికొస్తే.. ఈ కథ అంతా ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన సుశాంత్(విరాజ్ రెడ్డి) సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ ఉంటాడు. అక్కడ డాక్టర్ సామ్(మిమీ లియానార్డ్)తో ప్రేమలో పడతాడు. సుశాంత్ పనిచేసే హాస్పిటల్ బేస్మెంట్ లో ఎప్పుడూ ఏదో అరుపులు వినిపిస్తూ ఉంటాయి. తనని కూడా అక్కడకు తీసుకెళ్లమని సామ్ అడగడంతో తీసుకెళ్తాడు.

అనుకోకుండా సామ్ అక్కడ ఎవ్వరూ ఓపెన్ చేయని ఓ రూమ్ కి వెళ్లడంతో ఆమెలోకి ఒక ఆత్మ ప్రవేశిస్తుంది. దీంతో ఆ ఆత్మ సామ్ శరీరాన్ని ఇబ్బంది పెడుతూ సుశాంత్ ని, అతని ఫ్రెండ్ ని భయపెడుతుంది. అసలు ఆ ఆత్మ ఎవరిది? ఆ ఆత్మ కథ ఏంటి? సుశాంత్ కి ఆ ఆత్మకు సంబంధం ఏంటి? ఇతను చేసే సెక్యూరిటీ గార్డ్ పనితో అతను ఏం చేసాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Kiaraa Advani : గుడ్‌న్యూస్ చెప్పిన కియారా.. ‘అతి త్వ‌ర‌లో మా జీవితాల్లోకి విలువైన గిఫ్ట్’

సినిమా విశ్లేషణ.. ఇది ఒక రెగ్యులర్ స్టోరీ. చనిపోయిన ఓ అమ్మాయి ఆత్మగా తిరిగొచ్చి తన పగను తీర్చుకోవడం అనేది చాలా సినిమాల్లో చూసాము. గార్డ్ సినిమా కూడా అదే కథ అయినా కథనంలో కొత్తదనం చూపించారు. ఆస్ట్రేలియాలో కథ జరగడం, అక్కడ గార్డ్ గా పనిచేసే హీరోతో కొత్తగా భయపెట్టడానికి ట్రై చేసారు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో – హీరోయిన్ పాత్రల పరిచయం, వారి ప్రేమతో సాగుతుంది. ప్రీ ఇంటర్వెల్ లో ఇచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇంటర్వెల్ కి ఆత్మ సామ్ లోకి దూరడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆసక్తి నెలకొంటుంది.

ఇక సెకండ్ హాఫ్ లో ఆ ఆత్మ ఏం చేసింది? తనని చంపింది ఎవరు? తన స్టోరీ ఏంటి? హీరో ఆ ఆత్మకు ఎలా సపోర్ట్ చేసాడు అని చూపించారు. సినిమా అంతా అక్కడక్కడా హారర్ ఎలిమెంట్స్ తో బాగానే భయపెట్టారు. హీరో – హీరోయిన్ ప్రేమ కథ కాస్త బోర్ కొడుతుంది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ తో నవ్వించే ప్రయత్నం చేసారు. క్లైమాక్స్ లో పార్ట్ 2 కి లీడ్ ఇవ్వడం గమనార్హం.

guard Movie Review

నటీనటుల పర్ఫార్మెన్స్.. విరాజ్ రెడ్డి చీలం కొత్తవాడైనా బాగా చేసాడు. మిమీ లియానార్డ్ అందాలు ఆరబోస్తూనే దయ్యం పట్టిన పాత్రలో బాగా నటించింది. శిల్ప బాలకృష్ణన్ కూడా తన నటనతో మెప్పించింది. హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన నటుడు అక్కడక్కడా నవ్వించాడు. నెగిటివ్ షేడ్స్ లో కమల్ కృష్ణ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also Read : Sabdham : ‘శబ్దం’ మూవీ రివ్యూ.. వామ్మో.. ఓ రేంజ్ లో భయపెట్టారుగా..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో బాగానే భయపెట్టారు. ఉన్న ఒక్క సాంగ్ యావరేజ్. కథ రెగ్యులర్ అయినా కథనం కొత్తగా చూపించి భయపెట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. నిర్మాణ పరంగా కూడా కావాల్సినంత ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘గార్డ్’ సినిమా ఆస్ట్రేలియాలో తీసిన ఓ హారర్ థ్రిల్లర్. కాస్త భయపడాలి అనుకుంటే వెళ్లి చూసేయొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.