హీరో విజయ్ ప్రేమంటే ఇదే : స్టంట్స్ వద్దంటూ ఫ్యాన్స్‌కు వేడుకోలు

  • Published By: vamsi ,Published On : March 7, 2019 / 08:03 AM IST
హీరో విజయ్ ప్రేమంటే ఇదే : స్టంట్స్ వద్దంటూ ఫ్యాన్స్‌కు వేడుకోలు

తమిళనాట ఇళయదళపతి విజయ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనను ఒక్కసారి చూసేందుకు అభిమానులు తహతహలాడిపోతుంటారు. విజయ్ సినిమాల పరంగానే కాదు.. సామాజిక కార్యక్రమాలలోనే ఎక్కువగా పాల్గొంటూ ఉంటాడు. ఈ క్రమంలో విజయ్‌ను ఆయన అభిమానులు దేవుడిగా భావిస్తుంటారు. తాజాగా విజయ్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణ చెన్నైలోని ఓ కళాశాల ఆవరణలో జరుగుతోంది.
Also Read : Big B కష్టాలు : అమితాబ్ బచ్చన్ కారు అమ్మేశాడట

అయితే షూటింగ్ నిమిత్తం అక్కడికి వస్తాడని తెలుసుకున్న అభిమానులు అక్కడకు చేరుకొన్నారు. విజయ్‌ వారిని పలకరించి అభివాదం చేసి కారులో వెళ్లిపోయారు. అయితే విజయ్‌ కారులో వెళుతున్నప్పుడు ఓ అభిమాని బైక్‌పై ఫాలో అవుతూ ‘తలైవా తలైవా’ అంటూ కేకలు వేశాడు. పైగా ఆ దృశ్యాన్ని టిక్‌టాక్‌ వీడియోగా రూపొందించి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అతన్ని గమనించిన విజయ్‌ కారు విండో నుంచి  హెచ్చరించారు. ‘నన్ను షూటింగ్‌ సెట్స్‌ వరకు ఎవ్వరూ ఫాలో అవ్వద్దు. వెళ్లిపోండి’ అంటూ రిక్వెస్ట్ చేశారు. వీడియోలో ఫాలో అవుతూ అలా రావడం చాలా ప్రమాదం అని అలా చెయ్యొద్దంటూ అభిమానులను విజయ్ కోరుతున్నట్లుగా ఉంది. ఈ వీడియో సామిజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్‌గా మారింది.

 

Also Read : చావుతో చెలగాటం.. అయినా వదల్లేదు : కారు బానెట్ పై 2కి.మీ వెళ్లాడు