ViralPicOfTheWeeK: సెలబ్రిటీల జోష్ ఫొటోల్లో..

ఈ వారం దేశంలో జరుగుతున్న పరిస్థితులు సెలబ్రిటీలపై ప్రభావం చూపించాయి. ఢిల్లీలో స్టూడెంట్స్ పై పోలీసులు జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోతుంటే బాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కరూ నోరు మెదపకపోవడంపై నెటిజన్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక సంవత్సరం ముగుస్తుండటంతో మరికొన్ని ఈవెంట్లలో కనిపించిన సెలబ్రిటీలు కలర్ ఫుల్ గా మెరిపించారు. రాజకీయాల్లోకి రావాలని పుట్టినరోజు సందర్భంగా నారా బ్రాహ్మణిని కోరుతూ అభిమానులు షేర్ చేస్తున్న ఫొటో ఒకటి వైరల్ గా మారింది. 

జనసేన తరపున నాగబాబు అమరావతి వాసుల కోసం దీక్ష చేస్తున్న ఫొటో, నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ పాడిన పాట మరోసారి టిక్ టాక్ మహానుభావులు అనే పేరుతో అప్ లోడ్ అయి వైరల్ గా మారింది. సరిలేరు నీకెవ్వరు ఎంతగా జనాల్లోకి వెళ్లిందంటే సినిమా రిలీజ్ కోసం తహతహలాడుతూ ఏ అప్ డేట్ వచ్చినా.. వదలడం లేదు. సరిలేరునీకెవ్వరు టిక్కెట్లను ప్రీ బుకింగ్ చేసుకోండి.. మహేశ్ బాబును గెలుచుకునే అవకాశం దక్కించుకోండి అని ఓ ఫొటో సోషల్ మీడియా ట్రెండ్ అయింది. 

ఇదే వారం ఐపీఎల్ వేలం జరిగింది. దీంతో ఎనిమిది ఫ్రాంచైజీల ప్లేయర్ల ఫొటోలను తమ అభిమానులు వైరల్ చేస్తూ ఉన్నారు. పూరి జగన్నాథ్ డైరక్షన్‌లో వస్తున్న సినిమా రొమాంటిక్. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరి హీరోగా నటిస్తున్న సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి ఇండస్ట్రీకి రొమాంటిక్ హీట్ పుట్టించాడు. కాజల్ ఫ్యామిలీకి అతుక్కుపోయింది. సినిమాలను కాస్త గ్యాప్ తీసుకుని ఫ్యామిలీతో గడుపుతుంది. ఇంత చలిలోనూ కురచ దుస్తుల్లో ఫొటో దిగి ఇట్స్ ఫ్యామిలీ టైమ్ అంటుంది.