Jithender Reddy : ఎలక్షన్స్ టైంలో పొలిటికల్ డ్రామాగా రాబోతున్న జితేందర్ రెడ్డి.. రియల్ లైఫ్ స్టోరీతో..
ఎలక్షన్స్ టైంలో పొలిటికల్ డ్రామాగా ఆడియన్స్ ముందుకు రాబోతున్న జితేందర్ రెడ్డి. రియల్ లైఫ్ స్టోరీతో..

Virinchi Varma Rakesh Varre Jithender Reddy release date update
Jithender Reddy : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ కనిపిస్తుంది. ఈ సమయంలో టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు ‘జితేందర్ రెడ్డి’ అనే పొలిటికల్ డ్రామా మూవీ రాబోతుంది. బాహుబలి సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాకేష్ వర్రే ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. విరించి వర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. గతంలో ఈ దర్శకుడు ఉయ్యాలా జంపాలా, మజ్ను లాంటి ప్రేమకథా చిత్రాలను డైరెక్ట్ చేసారు.
Also read : Game Changer : రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన దిల్ రాజు.. అలాగే రిలీజ్ డేట్ గురించి..
ఇప్పుడు పొలిటికల్ డ్రామాతో ఓ యాక్షన్ మూవీని తీసుకు రాబోతున్నారు. 1980లో జగిత్యాలలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ కథ కోసం మేకర్స్ ఎంతో రీసెర్చ్ చేశారట. ఇక ఈ రియల్ స్టోరీని మే 3న ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ డేట్ ఫిక్స్ చేసారు. రియా సుమన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా.. ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ముఖ్య పాత్రలు చేసారు. గోపీసుందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్‌పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.