Virupaksha Inching Toward Another Milestone Mark In US
Virupaksha: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘విరూపాక్ష’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. దర్శకుడు కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. హార్రర్ అంశాలు పుష్కలంగా ఉన్న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాలో అందాల భామ సంయుక్త మీనన్ సరికొత్త పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.
Virupaksha : పాన్ ఇండియా రిలీజ్‌కి సిద్దమైన విరూపాక్ష..
ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే వసూళ్లు వస్తుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.62.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. కాగా, ఈ సినిమాకు యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా సాలిడ్ వసూళ్లు వస్తున్నాయి. ఇప్పటికే అక్కడ ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్‌లో జాయిన్ అయ్యింది. ఇక రెండో వారంలోకి అడుగుపెట్టిన విరూపాక్ష సినిమాకు కొత్త రిలీజ్‌లు ఏమాత్రం పోటీనివ్వలేకపోతున్నాయి. దీంతో ఈ సినిమాను చూసేందుకు అక్కడి ఆడియెన్స్ ఆసక్తిని కనబరుస్తున్నారు.
Virupaksha: మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విరూపాక్ష
ఈ క్రమంలో విరూపాక్ష మరో మైల్‌స్టోన్ మార్క్‌ను చేరుకోవడం ఖాయమని సీనీ వర్గాలు చెబుతున్నాయి. విరూపాక్ష మూవీ తన రన్‌ను ఇలాగే కంటిన్యూ చేస్తే, త్వరలోనే 1.5 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి అడుగుపెట్టడం ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు.