Virupaksha : పాన్ ఇండియా రిలీజ్‌కి సిద్దమైన విరూపాక్ష..
తెలుగు బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష పాన్ ఇండియా రిలీజ్ కి సిద్దమవుతుంది. ఈ చిత్రాన్ని..

Sai Dharam Tej Virupaksha is ready getting ready for pan india release
Virupaksha : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) బైక్ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న కమ్ బ్యాక్ ఇస్తూ చేసిన సినిమా విరూపాక్ష. సంయుక్త (Samyuktha) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సుకుమార్ రైటింగ్స్, ఎస్వీసీసీ బ్యానర్లు కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని కార్తీక్ దండు డైరెక్ట్ చేశాడు. మిస్టికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తామంటూ ముందుగా మేకర్స్ తెలియజేశారు. కానీ విడుదలకు ముందు తెలుగులో వచ్చిన రెస్పాన్స్ ని బట్టి ఇతర భాషల్లో రిలీజ్ చేద్దామని నిర్ణయం తీసుకున్నారు.
Chef Mehigan : నాటు నాటు వినలేదు.. RRR తెలియదు.. ఫేమస్ చెఫ్!
ఇక తెలుగులో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు పాన్ ఇండియా రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏయే భాషల్లో ఏ నిర్మాణ సంస్థలు రిలీజ్ చేయబోతున్నాయో ప్రకటించారు మేకర్స్. హిందీలో గోల్డ్ మైన్స్ సంస్థ, తమిళంలో స్టూడియో గ్రీన్, మలయాళంలో E4 ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ లు రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. అయితే కన్నడలో ఎవరు ఏ సంస్థ విరూపాక్ష థియేటర్ హక్కులు సొంతం చేసుకుందో తెలియజేయలేదు. దీంతో కన్నడలో రిలీజ్ చేస్తున్నారా? లేదా? అన్న సందేహం మొదలైంది.
Akhil Akkineni – Ram Charan : అయ్యప్ప మాల వేసుకోమని రామ్ చరణ్ చెప్పాడు.. అది నాకు.. అఖిల్!
అలాగే సినిమా విడుదల తేదీల కూడా తెలియజేయలేదు. కాగా ఒక్క తెలుగులోనే 7 రోజుల్లో 62 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని రికార్డు క్రియేట్ చేసిన విరూపాక్ష.. ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ పాజిటివ్ బజ్ తో రిలీజ్ అయ్యి సంచలనాలు సృష్టించడానికి సిద్దమవుతుంది. కార్తికేయ 2, కాంతార సినిమాలు మాదిరి విరూపాక్ష కూడా పాన్ ఇండియా సక్సెస్ ని అందుకోవడంలో సందేహం లేదంటున్నారు ట్రేడ్ పండితులు.
After the Blockbuster Success in Telugu,
We are gearing up to release #Virupaksha in other languages ✅Hindi release – @GTelefilms
Tamil release – @StudioGreen2
Malayalam release – @E4Emovies@IamSaiDharamTej @iamsamyuktha_@karthikdandu86 @SVCCofficial @SukumarWritings pic.twitter.com/zXYpUqBexC— SVCC (@SVCCofficial) April 28, 2023