Chef Mehigan : నాటు నాటు వినలేదు.. RRR తెలియదు.. ఫేమస్ చెఫ్!

ఆస్కార్ అందుకున్న నాటు నాటు పాట గురించి తనకి అసలు తెలియదని, వినలేదని ఫేమస్ చెఫ్ వ్యాఖ్యానించిన మాటలు..

Chef Mehigan : నాటు నాటు వినలేదు.. RRR తెలియదు.. ఫేమస్ చెఫ్!

Chef Mehigan says he didnot know naatu naatu and rrr

Updated On : April 28, 2023 / 8:07 PM IST

Chef Mehigan : ఆస్కార్ (Oscar) అందుకున్న నాటు నాటు (Naatu Naatu) పాట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రంలోని ఈ పాటకి ఎన్టీఆర్ (NTR) అండ్ రామ్ చరణ్ (Ram Charan) వేసిన స్టెప్పులు ప్రతి ఒకర్ని చిందేసేలా చేశాయి. కీరవాణి సంగీతం అందించిన ఈ సాంగ్ కి చంద్రబోస్ లిరిక్స్, ప్రేమ్ రక్షిత్ డాన్స్ కోరియోగ్రఫీ, కాలభైరవ అండ్ రాహుల్ సిప్లిగంజ్ పాడారు.

Akhil Akkineni – Ram Charan : అయ్యప్ప మాల వేసుకోమని రామ్ చరణ్ చెప్పాడు.. అది నాకు.. అఖిల్!

కొరియన్ ఎంబసీ, జర్మన్ ఎంబసీ అధికారులు కూడా ఈ పాటకి చిందేయకుండా ఉండలేకపోయారు. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఎన్నో అవార్డులు అందుకొని RRR మరియు నాటు నాటు వరల్డ్ వైడ్ రీసౌండ్ మోగించింది. అయితే ఒక ఫేమస్ చెఫ్ తనకి RRR, నాటు నాటు గురించి అసలు తెలియదు అంటున్నాడు. ప్రముఖ ఆస్ట్రేలియన్ చెఫ్ మెహిగాన్ (Mehigan) ఇటీవల ఆంధ్రప్రదేశ్ వచ్చాడు. అతను మీడియాతో మాట్లాడుతున్న సమయంలో RRR వ్యాఖ్యలు తీసుకురాగా.. RRR అంటే ఏంటి అని అడిగాడు.

Baahubali 2: ఆరేళ్లు పూర్తి చేసుకున్న బాహుబలి-2.. ఇండియన్ సినిమాలో సరికొత్త ట్రెండ్‌సెట్టర్!

ఆర్ఆర్ఆర్ టాలీవుడ్ సినిమా అని, ఆ మూవీలోని నాటు నాటు సాంగ్ ఇటీవల ఆస్కార్ కూడా గెలుచుకుందని అతనకి చెప్పారు. దానికి మెహిగాన్ రెస్పాండ్ అవుతూ.. నేను నాటు నాటు సాంగ్ వినలేదని, RRR గురించి తనకి అసలు తెలియదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే, జపాన్ లో ఈ మూవీ జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. హౌస్ ఫుల్ కలెక్షన్స్ అందుకుంటూ జపనీస్ బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ మల్టీ ప్లేయర్ గా రికార్డు సృష్టించనుంది.