Virupaksha: మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విరూపాక్ష

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’ యూఎస్ బాక్సాఫీస్ వద్ద మిలియన్ డాలర్ క్లబ్ లోకి అడుగుపెట్టింది.

Virupaksha: మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విరూపాక్ష

Virupaksha Movie Enters 1 Million Dollar Club In US

Updated On : April 27, 2023 / 8:06 PM IST

Virupaksha: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ దండు డైరెక్ట్ చేయగా, పూర్తి మిస్టిక్ థ్రిల్లర్ మూవీగా రూపొందించారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

Virupaksha: 4 రోజులు.. 50 కోట్లు.. విరూపాక్ష విశ్వరూపం!

ఈ సినిమాలోని హార్రర్ ఎలిమెంట్స్ ఆడియెన్స్‌ను కట్టిపడేశాయి. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడంలో సక్సెస్ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సత్తా చాటింది. కాగా, ఈ సినిమాకు ఓవర్సీస్‌లో ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఈ చిత్రానికి యూఎస్‌లో సాలిడ్ వసూళ్లు వస్తున్నాయి. దీంతో ఈ సినిమా యూఎస్‌లో ఏకంగా మిలియన్ డాలర్ క్లబ్‌లోకి చేరింది.

Virupaksha: యూఎస్ బాక్సాఫీస్ దగ్గర తగ్గేదే లే అంటోన్న ‘విరూపాక్ష’

సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా ‘విరూపాక్ష’ నిలిచింది. అతడి కెరీర్‌లో తొలి మిలియన్ డాలర్ మూవీగా విరూపాక్ష సత్తా చాటింది. కాగా, ఈ సినిమాలో అందాల భామ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటించగా, బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.