Vishal : సెన్సార్ బోర్డుపై విశాల్ సంచలన వ్యాఖ్యలు.. మార్క్ ఆంటోని రిలీజ్ అవ్వడానికి లంచం తీసుకున్నారంటూ..

మార్క్ ఆంటోనీ సినిమా రిలీజ్ అయ్యాక సెన్సార్ బోర్డు(Censor Board) ముంబై ఆఫీస్ పై సినిమా రిలీజవ్వడానికి 6.5 లక్షల లంచం తీసుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు విశాల్.

Vishal : సెన్సార్ బోర్డుపై విశాల్ సంచలన వ్యాఖ్యలు.. మార్క్ ఆంటోని రిలీజ్ అవ్వడానికి లంచం తీసుకున్నారంటూ..

Vishal Alleges paid Bribe to Censor Board for Releasing Mark antony Movie in Hindi

Updated On : September 29, 2023 / 6:56 AM IST

Vishal : తమిళ హీరో విశాల్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే విశాల్, SJ సూర్య(SJ Surya) ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన మార్క్ ఆంటోనీ(Mark Antony) సినిమా రిలీజయి భారీ విజయం సాధించింది. చాలా గ్యాప్ తర్వాత విశాల్ మంచి హిట్ కొట్టాడు. ఇక మార్క్ ఆంటోని సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేశారు. అయితే సౌత్ మొత్తం మార్క్ ఆంటోనీ సినిమా సెప్టెంబర్ 15న రిలీజయింది. హిందీలో మాత్రం సెప్టెంబర్ 22న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

కానీ కొన్ని అనివార్య కారణాలు అంటూ మార్క్ ఆంటోనీ సినిమాని నిన్న సెప్టెంబర్ 28న హిందీలో రిలీజ్ చేశారు. అయితే మార్క్ ఆంటోనీ సినిమా రిలీజ్ అయ్యాక సెన్సార్ బోర్డు(Censor Board) ముంబై ఆఫీస్ పై సినిమా రిలీజవ్వడానికి 6.5 లక్షల లంచం తీసుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు. ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు.

విశాల్ తన ట్వీట్ లో.. వెండితెరపై కరప్షన్ చూపించడం ఓకే కానీ రియల్ లైఫ్ లో కాదు. ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో. ఇప్పుడు ఇది ముంబై CBFC ఆఫీస్ లో జరిగింది. నా మార్క్ ఆంటోనీ సినిమా హిందీ వర్షన్ రిలీజ్ అవ్వడానికి 6.5 లక్షలు రెండు విడతలుగా ఇవ్వాల్సి వచ్చింది. 3 లక్షలు స్క్రీనింగ్ కి, 3.5 లక్షలు సర్టిఫికెట్ కి ఇచ్చాను. నా కెరీర్ లో ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. నాకు సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకో దారి లేకుండా పోయింది. అందుకే సినిమా రిలిజ్ అయ్యాకే, ట్రాన్సక్షన్స్ జరిగాకే ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి తీసుకువస్తున్నాను. ఇది నా ఒక్కడి కోసం చెయ్యట్లేదు. భవిష్యత్తులో ఇంకే నిర్మాత ఇలా బాధపడకూడదు. నేను కష్టపడిన డబ్బు ఎందుకు లంచంగా ఇవ్వాలి? ఆధారాలు ఇక్కడే పోస్ట్ చేస్తున్నాను అంటూ విశాల్ డబ్బులు పే చేసిన సెన్సార్ ఆఫీసర్స్ పేర్లు, అకౌంట్ డీటెయిల్స్ కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

Also Read : Disney Plus Sharing Password : నెట్‌ఫ్లిక్స్ బాటలో డిస్నీ ప్లస్.. ఇకపై యూజర్లు వారితో పాస్‌వర్డ్ షేరింగ్ చేయలేరు..!

దీంతో విశాల్ ట్వీట్ సంచలనంగా మారింది. అటు సినీ పరిశ్రమలోనూ, ఇటు రాజకీయాల్లోనూ విశాల్ ట్వీట్ చర్చగా మారింది. అయితే ఇప్పటివరకు ఆ సెన్సార్ ఆఫీసర్స్ కానీ, గవర్నమెంట్ కానీ దీనిపై స్పందించలేదు. మరి విశాల్ ట్వీట్ కి ఎవరైనా స్పందించి చర్యలు తీసుకుంటారేమో చూడాలి. ఇక విశాల్ ఇలా ఓపెన్ గా లంచం తీసుకున్నారు అంటూ పేర్లు, అకౌంట్స్ తో సహా డీటెయిల్స్ పెట్టడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు విశాల్ ని అభినందిస్తున్నారు.