Disney Plus Sharing Password : నెట్‌ఫ్లిక్స్ బాటలో డిస్నీ ప్లస్.. ఇకపై యూజర్లు వారితో పాస్‌వర్డ్ షేరింగ్ చేయలేరు..!

Disney Plus Sharing Password : నెట్‌ఫ్లిక్స్ ఇండియా (Netflix India)లో యూజర్లను వారి ఇంటి వెలుపల పాస్‌వర్డ్‌లను షేర్ (Password Sharing) చేయకుండా నిలిపివేసింది. ఇప్పుడు, డిస్నీ (Disney Plus) కూడా అదే బాటలో పయనిస్తోంది.

Disney Plus Sharing Password : నెట్‌ఫ్లిక్స్ బాటలో డిస్నీ ప్లస్.. ఇకపై యూజర్లు వారితో పాస్‌వర్డ్ షేరింగ్ చేయలేరు..!

After Netflix, Disney Plus Stops Users from Sharing Password Outside household

Disney Plus Sharing Password : ప్రముఖ ఆన్‌లైన్ ఓటీటీ స్ట్రీమింగ్ కంపెనీ డిస్నీ ప్లస్ (Disney Plus) వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. చాలా మంది యూజర్లు వివిధ OTT సర్వీసులను వినియోగించుకుంటున్నారు. కానీ దేనికీ నిజంగా చెల్లించరు. చాలా కాలంగా ఇలాగే కొనసాగుతోంది. OTT ప్లాట్‌ఫారమ్‌లు కంటెంట్‌ని వినియోగించుకోవడానికి భారతీయులకు ప్రముఖ ఎంపికగా మారినప్పటి నుంచి ఇలానే జరుగుతోంది.

అయితే, ఇప్పుడు ఈ పద్ధతిని నిలిపివేసేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఏడాది జూలైలో, నెట్‌ఫ్లిక్స్ (Netflix India) భారతీయ యూజర్లు తమ పాస్‌వర్డ్‌లను తమ ఇంటి వెలుపల షేర్ చేయకుండా నిషేధించింది. ఇప్పుడు, డిస్నీ అదే ఫాలో అవుతోంది. ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్, (Disney Plus), కెనడాలోని వినియోగదారులు తమ పాస్‌వర్డ్‌లను తమ ఇంటి వెలుపల షేర్ చేయవద్దని కోరుతోంది.

Read Also : Apple Warn iPhone 15 Users : ఐఫోన్ 15 యూజర్లకు ఆపిల్ వార్నింగ్.. ఆండ్రాయిడ్ ఛార్జర్లను పొరపాటున కూడా వాడొద్దు.. తస్మాత్ జాగ్రత్త..!

డిస్నీ ప్లస్ పాస్‌వర్డ్ షేరింగ్‌ నిలిపివేత :
కెనడాలోని వినియోగదారులు ఇకపై తమ పాస్‌వర్డ్‌లను తమ ఇంటి వెలుపల ఉన్న వారితో నవంబర్ 1 నుంచి షేర్ చేయలేరు. కెనడాలోని డిస్నీ+ సబ్‌స్క్రైబర్‌లకు పంపిన ఇమెయిల్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. నివేదిక ప్రకారం.. ‘మీ అకౌంట్ షేరింగ్ చేయడానికి లేదా మీ ఇంటి వెలుపల లాగిన్ ఆధారాలను పంచుకునే మీ సామర్థ్యంపై పరిమితులను విధిస్తున్నాం’ అని ఇమెయిల్ ద్వారా తెలియజేసింది.

ఈ కొత్త విధానాన్ని పాటించని వినియోగదారులకు ఏమి జరుగుతుంది? వారి అకౌంట్‌పై లిమిట్ విధిస్తుంది లేదా పూర్తిగా క్యాన్సిల్ చేయొచ్చు. కెనడా సబ్‌స్ర్కైబర్ల ఒప్పందంలో అకౌంట్ షేరింగ్ అనే కొత్త విభాగం యూజర్ల అకౌంట్ వినియోగాన్ని కంపెనీ విశ్లేషించడం ప్రారంభించవచ్చు. కొత్త సూచనలకు అనుగుణంగా లేకుంటే.. వారి అకౌంట్ పరిమితం చేయడం లేదా రద్దు చేయొచ్చు.

Disney Plus Sharing Password

Disney Plus Sharing Password

భారతీయ యూజర్లపై ప్రభావం ఉంటుందా? :
డిస్నీ ప్లస్ కొత్త మార్పుతో భారతీయులు ప్రభావితమవుతారా? ప్రస్తుతానికి, కెనడియన్ సబ్‌స్క్రైబర్‌లు మాత్రమే పాస్‌వర్డ్‌ను షేర్ చేయకుండా నిరోధించినట్టు కనిపించడం లేదు. కానీ, భవిష్యత్తులో, డిస్నీ ఇతర దేశాలలో కూడా పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేయాలని నిర్ణయించుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్ కూడా ముందుగా ఎంచుకున్న దేశాలలో పాస్‌వర్డ్ షేరింగ్‌పై అణిచివేతను ప్రారంభించింది. డిస్నీ అదే పద్ధతిని ఫాలో చేయనుంది. అది క్రమంగా ఇతర దేశాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది.

భారతీయ యూజర్ల కోసం పాస్‌వర్డ్ షేరింగ్‌పై అణిచివేతను ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్ ప్రకారం.. భారతీయ యూజర్లు ఇంటి వెలుపల నెట్‌ఫ్లిక్స్‌ను షేర్ చేస్తున్న సభ్యులకు ఈ ఇమెయిల్‌ను పంపుతాము. నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ అనేది ఒక కుటుంబానికి మాత్రమే వర్తిస్తుంది. ఆ ఇంటిలో నివసించే ప్రతి ఒక్కరూ నెట్‌ఫ్లిక్స్‌ని వారు ఎక్కడ ఉన్నా ఇంట్లో, ప్రయాణంలో, సెలవుల్లో ఉపయోగించవచ్చు. ప్రొఫైల్‌ను ట్రాన్స్‌ఫర్ చేయడం, యాక్సెస్ డివైజ్‌లను నిర్వహించడం వంటి కొత్త ఫీచర్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చు.

Read Also : Flipkart Sale Offers : కొత్త ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ ఫోన్ ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!