Vishal Ritu Varma Mark Antony Teaser released
Mark Antony Teaser : తమిళ యాక్షన్ హీరో విశాల్ (Vishal) ఇటీవల లాఠీ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయం సాధించలేక పోయింది. ప్రస్తుతం విశాల్ ‘మార్క్ ఆంటోనీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ జె సూర్య, సునీల్, సెల్వరాఘవన్, అభినయ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్ చూసి.. మార్క్ ఆంటోనీ రా అండ్ రస్టిక్ కథతో ఉండబోతుందని అందరు అనుకున్నారు.
Ram Charan – Samantha : రామలక్ష్మికి చిట్టిబాబు ట్వీట్.. చాలా గర్వంగా ఉంది!
అయితే ఇది ఒక టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఒక ఫోన్ ద్వారా టైం ట్రావెల్ చేయడం సాధ్యం అవుతుంది. అయితే అది గ్యాంగ్ స్టార్స్ కి చిక్కితే ఎటువంటి సమస్యలు ఎదురుకోవాల్సి వస్తుంది అనే కాన్సెప్ట్ తో చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా ఈ సినిమాలో విశాల్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. టీజర్ చూస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. టీజర్ లో యాక్టర్స్ అంతా 90’s గెటప్ అండ్ ప్రెజెంట్ డ్రెస్సింగ్ స్టైల్ తో కనిపించారు. దీనిబట్టి చూస్తే 90 అండ్ 20’s మధ్య టైం ట్రావెల్ స్టోరీ అని తెలుస్తుంది.
Dil Raju : నా 25 ఏళ్ల కెరీర్‌లో సమంత మూవీ.. పెద్ద షాక్ ఇచ్చింది.. దిల్ రాజు!
అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. మినీ స్టూడియో పతాకం పై ఎస్ వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో ఇవ్వనున్నారు. కాగా విశాల్ తన స్వీయ దర్శకత్వంలో ‘డిటెక్టివ్ 2’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. 2017 లో వచ్చిన డిటెక్టివ్ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. ఈ ఏడాది ఆగష్టులో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.