Vishal Sensational comments on Producers in Mark Antony Promotions
Vishal : తమిళ్ హీరో విశాల్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. తన ప్రతి సినిమాని ఇక్కడ కూడా ప్రమోట్ చేస్తూ.. ఇక్కడ కూడా రిలీజ్ చేస్తారు. త్వరలో విశాల్ మార్క్ ఆంటోని(Mark Antony) అనే సినిమాతో రాబోతున్నారు. సెప్టెంబర్ 15న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పటికే రిలీజయిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. టైం ట్రావెల్ కథతో, పీరియాడిక్ స్టైల్ లో కొత్తగా ఉంది మార్క్ ఆంటోనీ ట్రైలర్.
ప్రస్తుతం విశాల్ మార్క్ ఆంటోనీ సినిమా ప్రమోషన్స్ లో ఉన్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రెస్ మీట్ లో తానే ఎందుకు సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించారు అనే దానికి సమాధానమిస్తూ నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు విశాల్.
Mahesh Babu Pet Dog : మహేష్ బాబు ఇంట్లో ప్లూటో చనిపోయింది.. స్నూపీ వచ్చింది..
విశాల్ మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో అందరికి ఏదో ఒకరకమైన సమస్యలు ఉంటాయి. చాలా కాలం వెయిట్ చేసి పందెంకోడి సినిమా చేశాను. అది పెద్ద హిట్ అయింది. ఆ సినిమాతో తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. ఆ సినిమా నాకు యాక్షన్ హీరో అనే పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత వరుస సినిమాలు చేశాను. కానీ అవి రిలీజ్ అయ్యే సమయానికి నిర్మాతలు నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు. శుక్రవారం సినిమా రిలీజ్ అంటే గురువారం రాత్రి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేవాళ్ళు. ఫైనాన్షియర్స్ కి డబ్బులు ఇవ్వలేదు, సినిమా రిలీజ్ అవ్వదు అని చెప్పి నాతో డబ్బులు కట్టించేవాళ్ళు. సరిగ్గా రెమ్యునరేషన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. అదే సమయంలో ఫ్లాప్స్ కూడా వచ్చాయి. ఇలాంటి ఇబ్బందులు చాలా చూశాను. అందుకే నా వాళ్ళ కాదనుకొని నేనే సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ ప్రారంభించి మంచి కథలతో వరుసగా సినిమాలు చేస్తూ నిలబడ్డాను అని అన్నారు. దీంతో విశాల్ నిర్మాతలపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మరి ఈ వ్యాఖ్యలపై నిర్మాతలు ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.