Konda Polam: వైష్ణవ్ తేజ్ తొలిలుక్‌లోనే కట్టిపడేశాడు!
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి టైటిల్ కి తగ్గట్లే భారీ సక్సెస్ కొట్టాడు మరో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సక్సెస్ లో ఉండగానే రెండో సినిమా

Konda Polam
Konda Polam: ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి టైటిల్ కి తగ్గట్లే భారీ సక్సెస్ కొట్టాడు మరో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సక్సెస్ లో ఉండగానే రెండో సినిమా కూడా సిద్ధమైనా కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది విడుదల వాయిదా పడుతూ వచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ కొండపొలం అనే నవల ఆధారంగా ఓ సినిమా చేశాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా కరోనా కారణంగా వాయిదా పడింది.
కాగా, తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ముందే అనుకున్నట్లుగానే నవల పేరునే ఈ సినిమా టైటిల్ గా పెట్టారు. ‘కొండపొలం’గా టైటిల్ ఖరారు చేసి మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ వీడియోతో వైష్ణవ్ తేజ్ ఆకట్టుకోగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇందులో వైష్ణవ్ తేజ్ మాస్ లుక్‌లో కనిపిస్తుండగా.. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.
అక్టోబర్ 8న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ రీసెంట్‌గా ప్రకటించగా.. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ కూడా పూర్తిచేసుకున్నట్లు వినిపిస్తుంది. మొదటి సినిమా ఉప్పెనతో వైష్ణవ్ తేజ్ ఏకంగా 78 కోట్లు కలెక్ట్ చేయగా దాని ప్రభావంతో కొండపోలం సినిమాకు మంచి మార్కెట్ క్రియేట్ అయిందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా పాటలు విడుదల కానుండగా కీరవాణి సంగీతం ఈ సినిమాకు మరింత ప్లస్ కానుందని చెప్తున్నారు.