Vishnu Vishal : ముస్లిమ్స్ కి ఈ సినిమా వ్యతిరేకమనుకున్నారు.. కానీ..
ఈ వివాదంపై హీరో విష్ణు విశాల్ 10 టీవీతో మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో ఎవర్ని కించపరచలేదు. ఎవరికీ వ్యతిరేకం కాదు. కొంతమంది అభ్యంతరం అని చెప్పారు. వారు చెప్పిన సన్నివేశాల్ని ఆల్రెడీ.....

Vishnu Vishal
Vishnu Vishal : విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కిన ‘ఎఫ్ఐఆర్’ సినిమా ఇటీవల ఫిబ్రవరి 11న విడుదల అయింది. ఏ సంబంధం లేని ఓ ముస్లిం వ్యక్తిని టెర్రరిస్ట్ గా ముద్ర వేస్తే అతను ఆ ముద్ర నుంచి ఎలా బయట పడ్డాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. గతంలో కూడా ఇదే కథాంశంతో చాలా సినిమాలు వచ్చాయి. అయితే FIR సినిమాలో యాక్షన్ థ్రిల్లర్ అంశాలు జోడించి తెరకెక్కించారు. తమిళ్, తెలుగు భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయింది.
అయితే ఈ సినిమా ముస్లిమ్స్ మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎంఐఎం నేత, యాకుత్ పురా ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌కు ఈ విషయమై లేఖ రాశారు. ‘ఎఫ్ ఐ ఆర్’ సినిమాలోని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తక్షణం సినిమా నుంచి, ప్రమోషన్ వీడియోల నుంచి ఆ సన్నివేశాల్ని తొలగించాలని కోరారు.
Shankar : ‘రోబో’ సినిమా స్పూర్తితో ‘అవెంజర్స్’ సీన్స్ తీశాము : అవెంజర్స్ డైరెక్టర్
ఈ వివాదంపై హీరో విష్ణు విశాల్ 10 టీవీతో మాట్లాడుతూ.. ”ఈ సినిమాలో ఎవర్ని కించపరచలేదు. ఎవరికీ వ్యతిరేకం కాదు. కొంతమంది అభ్యంతరం అని చెప్పారు. వారు చెప్పిన సన్నివేశాల్ని ఆల్రెడీ తొలిగించాము. ఈ సినిమాలో ముస్లిమ్స్ ని నెగిటివ్ గా చూపించలేదు. చాలా పాజిటివ్ గానే చుపించాము. ఈ సినిమా ఏ మతస్థుల్ని కించపరిచేట్టు తీయలేదు, ప్రతి ఇండియన్ గర్వించే విధంగా తీశాము. నాకు చాలా మంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళంతా కూడా సినిమా చూసి బాగుందని మెచ్చుకున్నారు. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ముస్లిం. సయ్యద్ మహమ్మద్ నాకు 25 ఏళ్లుగా స్నేహితుడు. అతను కూడా సినిమా చూసి బాగుందని చెప్పాడు. ఇది కేరళలో జరిగిన రియల్ సంఘటన” అని తెలిపారు.