Vishnupriya : ఆ వల్గర్ కంటెంట్‌కి నాకు సంబంధం లేదు.. నా ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయింది..
తాజాగా విష్ణుప్రియ ఫేస్ బుక్ అకౌంట్ లో కొన్ని వల్గర్ పోస్టులు కనిపించాయి. అసభ్యకరమైన ఫోటోలు, పోస్టులు కనిపించాయి. దీంతో ఆమె అభిమానులు, పలువురు సన్నిహితులు ఆమెకి మెసేజెస్, కాల్స్ చేశారు. దీనిపై స్పందిస్తూ విష్ణుప్రియ.............

Vishnupriya facebook account hacked
Vishnupriya : బుల్లితెరపై యాంకర్ గా, షార్ట్ ఫిలిమ్స్, పలు సినిమాల్లో నటిగా పాపులారిటీ సంపాదించింది విష్ణుప్రియ. ఇక సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలతో బాగా ఫేమ్ తెచ్చుకుంది. ఛాన్స్ దొరికితే తన అందాలని ఆరబోస్తూ ఫోటోషూట్స్ చేస్తుంది విష్ణుప్రియ.
తాజాగా విష్ణుప్రియ ఫేస్ బుక్ అకౌంట్ లో కొన్ని వల్గర్ పోస్టులు కనిపించాయి. అసభ్యకరమైన ఫోటోలు, పోస్టులు కనిపించాయి. దీంతో ఆమె అభిమానులు, పలువురు సన్నిహితులు ఆమెకి మెసేజెస్, కాల్స్ చేశారు. దీనిపై స్పందిస్తూ విష్ణుప్రియ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో షేర్ చేసింది.
Ori Devuda Diwali Dawath Event : ఓరి దేవుడా సినిమా దివాళీ దావత్ ఈవెంట్ గ్యాలరీ
విష్ణుప్రియ దీనిపై స్పందిస్తూ.. ”నా ఫేస్ బుక్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు. ఉదయం నుంచి నాకు చాలా మెసేజ్ లు వస్తున్నాయి. అందులో అసలు ఏం కంటెంట్, పోస్టులు పెట్టారో నాకు తెలీదు. గతంలో కూడా నా అకౌంట్ హ్యాక్ అయింది. దయచేసి ఆ అకౌంట్ ని ఫాలో అవ్వకండి. ఆ అకౌంట్ ని రిపోర్ట్ కొట్టండి. ఈ విషయాన్ని అందరికి చెప్పండి. ఆ అకౌంట్ లో వల్గర్ కంటెంట్ కి నాకు సంబంధం లేదు. అకౌంట్ డిలీట్ చేయాలనుకున్నా అవ్వట్లేదు. నేను చేయాల్సింది చేస్తాను. నన్ను క్షమించండి ఎవరికైనా ఇబ్బంది కలిగితే” అని తెలిపింది.