Vishnupriya : యాంకర్ విష్ణు ప్రియ‌కి మాతృవియోగం..

టాలీవుడ్ లో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న భామ 'యాంకర్ విష్ణు ప్రియా. కాగా నిన్న విష్ణు ప్రియా తల్లి కన్నుమూశారు.

Vishnupriya : యాంకర్ విష్ణు ప్రియ‌కి మాతృవియోగం..

Vishnupriya

Updated On : January 27, 2023 / 10:37 AM IST

Vishnupriya : టాలీవుడ్ లో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న భామ ‘యాంకర్ విష్ణు ప్రియా. మొదటి నటిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో నటించింది. వెండితెరతో పరిచమైన విష్ణు ప్రియకి గుర్తింపు తీసుకు వచ్చింది మాత్రం బుల్లితెర. సుడిగాలి సుధీర్ తో కలిసి ‘పోరా పోవే’ కామెడీ షోలో యాంకర్ గా చేసి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆ తరువాత బుల్లితెర పై మరిన్ని షోలకు వ్యాఖ్యాతగా చేస్తూ అలరిస్తూ వస్తుంది. కాగా ఎప్పుడు సరదాగా ఉండే విష్ణు ప్రియకి తీరని కష్టం వచ్చింది.

Vishnupriya : థాయిలాండ్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న విష్ణుప్రియ..

విష్ణు ప్రియా తల్లి నిన్న (జనవరి 26) కన్నుమూశారు. ఆమె మరణానికి గల కారణం అయితే తెలియలేదు. ఇక తల్లి మరణాన్ని జీర్ణించుకోలేని విష్ణు ప్రియా సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనని వ్యక్తం చేసింది. “మై డియర్ లవ్లీ మమ్మీ.. ఈ రోజు వరకు నువ్వు నా పక్కన ఉన్నందుకు చాలా థాంక్యూ. నువ్వు ఇప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయి ఉండవచ్చు కానీ నా ప్రతి శ్వాసలో నువ్వే ఉన్నావు. మాకు మంచి జీవితాన్ని కల్పించడానికి నువ్వు ఎన్నో త్యాగాలు చేస్తూ వచ్చావు, అందుకు నీకు చాలా రుణపడి ఉంటాము.

నువ్వే నా బలం, నువ్వే నా బలహీనత. నా చివరి శ్వాస వరకు నిన్ను ఆరాధిస్తూ, ప్రేమిస్తూనే ఉంటాను. ఇప్పటి నుంచి నీ ముద్దలను మిస్ అవుతాను అమ్మా” అంటూ ఎమోషనల్ అవుతూ పోస్ట్ వేసింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు మరియు తోటి నటీనటులు ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇటీవల మరో బుల్లితెర భామ రీతూ చౌదరి తండ్రి మరణంతో ఆమె ఇంట కూడా విషాదం చోటు చేసుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni)