Gaami : మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయిన ‘గామి’.. కలెక్షన్స్‌లో అదరగొడుతుందిగా..

గామి సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ సాధించి సక్సెస్ తో దూసుకుపోతుంది.

Gaami : మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయిన ‘గామి’.. కలెక్షన్స్‌లో అదరగొడుతుందిగా..

Vishwak Sen Chandini Chowdary Gaami Movie Collections Full Details

Updated On : March 11, 2024 / 10:57 AM IST

Gaami Collections : విశ్వక్ సేన్(Vishwak Sen), చాందిని చౌదరి(Chandini Chowdary), అభినయ, ఉమా, మహమ్మద్ సమద్.. పలువురు ముఖ్య పాత్రలతో విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ శబరీష్ ఆధ్వర్యంలో క్రౌడ్ ఫండింగ్ తో తెరకెక్కిన సినిమా ‘గామి’. ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా మహాశివరాత్రి నాడు మార్చ్ 8న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయి మంచి విజయం సాధించింది. ఓ సరికొత్త కాన్సెప్ట్, స్క్రీన్ ప్లేతో ప్రయోగాత్మక చిత్రంగా, హాలీవుడ్ విజువల్స్ తో అందర్నీ మెప్పిస్తుంది గామి సినిమా.

ముందు నుంచి గామి సినిమాపై అంచనాలు ఉండగా ఆ అంచనాలను అందుకుంది. గామి సినిమా మొదటి రోజే 9.07 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. రెండు రోజుల్లో 15 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా మూడు రోజుల్లో గామి సినిమా 20.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అంటే ఆల్మోస్ట్ 10 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ సాధించింది.

Also Read : Oppenheimer : ఆస్కార్ అవార్డుల్లో.. క్రిస్టోఫర్ నోలన్ ‘ఓపెన్ హైమర్’ హవా.. ఏ సినిమాలు ఎక్కువ అవార్డులు గెలిచాయంటే..

గామి సినిమా థియేట్రికల్ రైట్స్ 9 కోట్లకు పైగా అమ్ముడు పోయాయి. సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 10 కోట్లకు పైగా షర్ కలెక్షన్స్ సాధించాలి. గామి సినిమా మూడు రోజుల్లోనే ఈ కలెక్షన్స్ సాధించి సక్సెస్ తో దూసుకుపోతుంది. అన్ని ఏరియాలలో గామి బ్రేక్ ఈవెన్ అయి ప్రాఫిట్స్ లో ఉంది. అమెరికాలో కూడా హాఫ్ మిలియన్ డాలర్స్ దాటేసింది. దీంతో గామి ఇంత మంచి విజయం సాధించినందుకు చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారం పెద్ద సినిమాలు ఏమి లేకపోవడంతో గామి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.