Vishwak Sen: దీపావళికి ధమ్కీ ఇస్తానంటోన్న హీరో!
టాలీవుడ్‌లో మాస్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న విశ్వక్ సేన్, రీసెంట్‌గా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే క్లాస్ మూవీతో అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు. ఈ హీరో ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘ధమ్కీ’ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ‘ధమ్కీ’ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు విశ్వక్ సేన్ అండ్ టీమ్ ప్రకటించారు.

Vishwak Sen Dhamki First Look To Be Out On Diwali
Vishwak Sen: టాలీవుడ్‌లో మాస్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న విశ్వక్ సేన్, రీసెంట్‌గా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే క్లాస్ మూవీతో అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు. మాస్‌ను పక్కనబెట్టి పూర్తి క్లాస్ పాత్రలో ఈ సినిమాలో నటించి మెప్పించాడు విశ్వక్ సేన్. ఇక ఈ హీరో ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘ధమ్కీ’ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకుంది.
Vishwak Sen: రిలీజ్ డేట్ కన్ఫం చేసుకున్న విశ్వక్ సేన్ మూవీ
ఇక ‘ఫలక్‌నుమా దాస్’ మూవీ తరువాత మరోసారి ఈ యంగ్ హీరో మెగా ఫోన్ పట్టుకుంటున్నాడు. ‘ధమ్కీ’ మూవీని తాను స్వయంగా డైరెక్ట్ చేస్తూ నటిస్తున్నాడు. ఈ సినిమాను ఏకంగా 5 భాషల్లో రిలీజ్ చేసేందుకు భారీగా ప్లాన్ చేస్తున్నాడు ఈ హీరో. ఇక ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో అందాల భామ నివేథా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది.
Vishwak Sen : మరోసారి వార్తల్లో విశ్వక్‌సేన్.. వాటిని డిలీట్ చేయండి అంటూ హంగామా..
‘ధమ్కీ’ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు విశ్వక్ సేన్ అండ్ టీమ్ ప్రకటించారు. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దుతున్నామని.. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసి, సినిమాను కూడా త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తుండగా వన్మయీ క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.
Das Ka #Dhamki Releasing in 5 Languages ??
ధమ్కీ – धमकी – தம்கீ – ಧಮ್ಕಿ – ധംകി
Action Packed #DasKaDhamki FIRST LOOK on DIWALI?@Nivetha_Tweets #KarateRaju @KumarBezwada #VanmayeCreations #VScinemas pic.twitter.com/ZmIbjBYN9Z
— Vishwak Sen (@VishwakSenActor) September 2, 2022