Gangs Of Godavari : ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ పోస్టుపోన్.. కొత్త రిలీజ్ డేట్ ఏంటంటే..?
విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' అనుకున్నట్లే పోస్టుపోన్ అయ్యింది. నిర్మాతలు వాయిదా వార్తతో పాటు కొత్త రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు.

Vishwak Sen Gangs Of Godavari movie postponed
Gangs Of Godavari : టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ నటిస్తున్న ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ డిసెంబర్ 8న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ చిత్రం పోస్టుపోన్ అవ్వబోతుందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్ ఈ వాయిదా గురించి ఇన్‌డైరెక్ట్ గా మాట్లాడుతూ చేసిన ఓ పోస్టు నెట్టింట బాగా వైరల్ అయ్యింది. అయితే ఆ పోస్టులో విశ్వక్.. ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న కచ్చితంగా తీసుకోని వస్తానంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఈ మూవీ వాయిదాని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
ఈ మూవీని 2024 మార్చి 8న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. విశ్వక్ సేన్ అభిమానులను ఈ వార్త నిరాశపరిచింది. అయితే ఈ మూవీలో విశ్వక్ పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పి మేకర్స్ ఫ్యాన్స్ కొంచెం ఖుషీ చేశారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ చాలా గ్రే క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారట. ఈ పాత్ర విశ్వక్ కెరీర్ గుర్తుండిపోయేలా ఉంటుందని చెబుతున్నారు. చీకటి ప్రపంచంలో ఒక సాధారణ స్థాయి నుంచి ధనవంతుడిగా ఎదిగిన ఓ వ్యక్తి కథను రాజకీయ కోణంలో ఊరమాస్ గా చూపించబోతున్నారట.
Also read : Mahesh Babu : మహేష్ బాబు మూవీ టైటిల్ చెప్పిన సందీప్ వంగా.. ఆ సినిమాలో హీరో క్యారెక్టర్..
A tale of absolute grit and determination and the rise of a man from rags to riches! ??#GangsofGodavari will arrive in theatres on 8th March, 2024! ?? @VishwakSenActor @thisisysr @iamnehashetty @yoursanjali #KrishnaChaitanya @vamsi84 #SaiSoujanya @Venkatupputuri… pic.twitter.com/q5qoqyVi30
— Sithara Entertainments (@SitharaEnts) November 27, 2023
కృష్ణ చైతన్య ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. నేహా శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంటే మరో నటి అంజలి ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ‘సుట్టంలా సూసి’ సాంగ్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ అందుకుంది. కాగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇటీవల ఈ మూవీ సెట్స్ లో విశ్వక్ కి చిన్న ప్రమాదం జరిగింది. అయితే ఎటువంటి అవ్వలేదని సమాచారం.