Vishwak Sen : తన కొత్త సినిమా గురించి లీక్ చేసిన విశ్వక్.. లేడీ గెటప్‌తో ‘లైలా’గా..!

విశ్వక్ సేన్ తదుపరి సినిమాల లైనప్ అదిరిపోయింది. వెర్సటైల్ స్టోరీ సెలక్షన్ తో ఆడియన్స్ ని ఆకట్టుకునేలా..

Vishwak Sen : తన కొత్త సినిమా గురించి లీక్ చేసిన విశ్వక్.. లేడీ గెటప్‌తో ‘లైలా’గా..!

Vishwak Sen leak his story line up in Gaami movie press meet

Updated On : February 8, 2024 / 11:20 AM IST

Vishwak Sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలు వరకు ఉన్నాయి. వీటితో పాటు ‘లైలా’ అనే కొత్త సినిమాలో కూడా నటిస్తున్నట్లు విశ్వక్ సేన్.. రీసెంట్ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. అయితే విశ్వక్ ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన సినిమాలు విషయానికి వస్తే.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కల్ట్, గామి, VS10. గామి సినిమా వచ్చే నెలలో రిలీజ్ కి సిద్దమవుతుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూనే విశ్వక్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ ప్రెస్ మీట్ లో విశ్వక్ ని తన సినిమాలు గురించి ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ.. “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కల్ట్, గామి, VS10తో పాటు ‘లైలా’ అనే సినిమా కూడా చేస్తున్నాను. సినిమాలో నేనే లైలాగా కనిపించబోతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ఈ మాటలు బట్టి చూస్తుంటే.. లైలా సినిమాలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించబోతున్నారా..? అనే సందేహం కలుగుతుంది. ఇంటెన్స్ లవ్ స్టోరీతో లైలా ఉండబోతుందట.

Also read : Adivi Sesh : అప్పుడు పవన్ కళ్యాణ్‌కి విలన్‌గా.. ఇప్పుడు పవన్ విలన్‌కి హీరోగా..

ఇక ఇదే ఇంటర్వ్యూలో విశ్వక్.. తాను మరో సినిమాలో కూడా నటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఆ మూవీ గురించి మరో ఇంటర్వ్యూలో చెబుతానంటూ పేర్కొన్నారు. అయితే విశ్వక్ ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన సినిమాల స్టోరీ లైన్స్ ప్రతిదీ డిఫరెంట్ గా ఉంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. పీరియాడిక్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ తో వస్తుంది. విశ్వక్ డైరెక్ట్ చేస్తున్న ‘కల్ట్’ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ డ్రగ్స్ నేపథ్యంతో వస్తుంది.

గామి అఘోర టచ్ తో ఆడియన్స్ ముందుకు వస్తుంది. VS10 మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీకి ‘మెకానిక్ రాకీ’ టైటిల్ ని అనుకుంటున్నట్లు సమాచారం. ఇక లైలా ఏమో లవ్ స్టోరీతో వస్తుంది. ఇలా వెర్సటైల్ స్టోరీ సెలక్షన్ తో విశ్వక్ ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.