Mechanic Rocky : విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ హంగామా షురూ.. ప్రీరిలీజ్ ఈవెంట్‌, రెండో ట్రైల‌ర్‌కు డేట్ ఫిక్స్‌..

మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ న‌టిస్తున్న మూవీ మెకానిక్ రాకీ.

Vishwak Sen Mechanic Rocky Hungama Shuru

Mechanic Rocky : మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ న‌టిస్తున్న మూవీ మెకానిక్ రాకీ. రవితేజ ముళ్లపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ లు క‌థ‌నాయిక‌లు న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం న‌వంబ‌ర్ 22న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌, టీజ‌ర్‌, సాంగ్స్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇక విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డ‌డంతో చిత్ర బృందం ప్ర‌మోన‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

Dhanush : అమ‌ర‌న్ డైరెక్ట‌ర్‌కి అద‌రిపోయే ఛాన్స్ ఇచ్చిన ధ‌నుష్‌

అందులో భాగంగా మీమ‌ర్స్‌తో లంచ్‌, మ‌రో ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డంతో పాటు కాలేజీల‌ను విజిట్ చేయ‌నుంది. ఇక ప్రీరిలీజ్ వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు.

16న మీమ‌ర్స్‌తో లంచ్‌, 17న వ‌రంగ‌ల్‌లో ట్రైల‌ర్ 2.0 లాంచ్‌, 18న తిరుమ‌ల ద‌ర్శ‌నం, కాలేజీ విజిట్‌, 19న గోల్డెన్ ప్రెస్ పార్టీ, 20న ప్రీరిలీజ్ ఈవెంట్‌, 21న ఏఎంబీ రెడ్ కార్పెట్ ప్రీమియ‌ర్ ల‌ను వేయ‌నున్నారు.

Pushpa 2 : శ్రీలీల‌తో ఐట‌మ్ సాంగ్ మొద‌లుపెట్టిన అల్లు అర్జున్‌.. ఫోటో లీక్‌..