Dhanush : అమ‌ర‌న్ డైరెక్ట‌ర్‌కి అద‌రిపోయే ఛాన్స్ ఇచ్చిన ధ‌నుష్‌

రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో తెర‌కెక్కిన అమ‌ర‌న్ చిత్రం మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

Dhanush : అమ‌ర‌న్ డైరెక్ట‌ర్‌కి అద‌రిపోయే ఛాన్స్ ఇచ్చిన ధ‌నుష్‌

Dhanush teams up with Amaran director Rajkumar Periasamy for D55

Updated On : November 9, 2024 / 10:20 AM IST

Dhanush : రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో తెర‌కెక్కిన అమ‌ర‌న్ చిత్రం మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఆర్మీ మేజర్ ముకుంద వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ముకుంద రాజన్ పాత్రలో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ నటించగా, అతని భార్య ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటించింది.

ఇక ధ‌నుష్‌తో రాజ్‌కుమార్ పెరియస్వామి ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న‌ట్లు ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఇందుకు సంబంధించిన ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ధ‌నుష్ కెరీర్‌లో 55వ మూవీగా తెర‌కెక్క‌నుంది ఈ చిత్రం.

Pushpa 2 : శ్రీలీల‌తో ఐట‌మ్ సాంగ్ మొద‌లుపెట్టిన అల్లు అర్జున్‌.. ఫోటో లీక్‌..

డీ55 వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొంద‌నుంది. శుక్ర‌వారం చెన్నైలో ఈ చిత్ర పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర బృందం ఫోటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది.

గోపురం ఫిలిమ్స్ బ్యానర్ పై జి అన్బుచెజియన్ నిర్మిస్తున్నారు. మిగ‌తా న‌టీన‌టుల వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. త్వ‌ర‌లోనే తెలియ‌జేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్‌గా మారాయి.

Venkatesh : అరుకులో పిల్ల‌ల‌తో సంద‌డి చేస్తున్న వెంకీ మామ‌.. వీడియో వైర‌ల్‌