Vishwak Sen: పూరీతో సినిమా.. రిలాక్స్ అంటూ గాలి తీసేసిన దాస్!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ త్వరలో క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Vishwak Sen: పూరీతో సినిమా.. రిలాక్స్ అంటూ గాలి తీసేసిన దాస్!

Vishwak Sen Responds On Movie With Puri Jagannadh

Updated On : April 20, 2023 / 8:50 PM IST

Vishwak Sen: యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ‘దాస్ కా ధమ్కీ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను విశ్వక్ సేన్ స్వయంగా డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపారు. ఇక ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విశ్వక్, ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు.

Vishwak Sen: బాలీవుడ్‌లో ధమ్కీ ఇచ్చేందుకు రెడీ అయిన విశ్వక్ సేన్

ఇటీవల తన నెక్ట్స్ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన విశ్వక్, త్వరలో మరో క్రేజీ ప్రాజెక్టును పట్టాలెక్కించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో విశ్వక్ సేన్ త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనుల్లో పూరీ బిజీగా ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Vishwak Sen: ఇద్దరు హీరోయిన్లతో మాస్ కా దాస్ రొమాన్స్.. మామూలుగా ఉండదట!

కాగా, తాజాగా ఈ వార్తలపై విశ్వక్ రెస్పాండ్ అయ్యాడు. పూరీతో సినిమా చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలను తాను కూడా గతకొద్ది రోజులుగా వింటున్నానని.. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. తాను ప్రస్తుతం పూరీతో ఎలాంటి సినిమా చేయడం లేదని.. భవిష్యత్తులో ఒకవేళ వస్తే తాను చేసేందుకు రెడీ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో పూరీ-విశ్వక్ సేన్ కాంబినేషన్ వార్తలకు చెక్ పడినట్లు అయ్యింది.