Vishwak Sen : ఆంజనేయస్వామి మాల వేసుకున్న విశ్వక్ సేన్.. ఫోటోలు వైరల్..

తాజాగా విశ్వక్ ఫోటోలు వైరల్ గా మారాయి. అందుకు కారణం విశ్వక్ సేన్ ఆంజనేయ స్వామి మాల వేసుకున్నారు.

Vishwak Sen : ఆంజనేయస్వామి మాల వేసుకున్న విశ్వక్ సేన్.. ఫోటోలు వైరల్..

Vishwak Sen wears Anjaneya Swami Mala Photos Goes Viral

Updated On : September 25, 2023 / 9:56 AM IST

Vishwak Sen :  యువ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఓ పక్క వరుస సినిమాలు తీస్తూ బిజీగా ఉన్న విశ్వక్ సేన్ ఇటీవలే హోస్ట్ గా మారి ఆహా(Aha) ఓటీటీలో(OTT) ఫ్యామిలీ ధమాకా అనే షోని కూడా మొదలుపెట్టాడు. త్వరలో విశ్వక్ సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాతో రానున్నాడు.

Also Read : Kangana Ranaut : పోకిరి సినిమా నేను చేయాలి.. పూరి జగన్నాద్ సెలెక్ట్ చేశారు.. కానీ..

తాజాగా విశ్వక్ ఫోటోలు వైరల్ గా మారాయి. అందుకు కారణం విశ్వక్ సేన్ ఆంజనేయ స్వామి మాల వేసుకున్నారు. ఆహా ఫ్యామిలీ ధమాకా షో ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఈవెంట్ లో పాల్గొనగా ఆంజనేయ స్వామి మాల దుస్తుల్లో కనిపించారు. అలాగే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా తన ఫోటోని పోస్ట్ చేసి జై భజరంగ్ బలి అని రాశారు విశ్వక్. దీంతో ఆంజనేయ స్వామి మాలలో ఉన్న విశ్వక్ సేన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఎప్పుడు ఫైర్ గా ఉండే విశ్వక్ లో.. భక్తి కోణం కూడా ఉందా అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Vishwak Sen wears Anjaneya Swami Mala Photos Goes Viral