Viva Harsha : ఈ షార్ట్ ఫిలిం గుర్తుందా? హర్షని సెలబ్రిటీగా మార్చిన వైవా.. 11 ఏళ్ళు పూర్తవడంతో ఎమోషనల్ పోస్ట్..

మనందరికీ వైవా షార్ట్ ఫిలిం గుర్తు ఉండే ఉంటుంది. ఇవాళ్టికి వైవా వచ్చి 11 ఏళ్ళు అవుతుంది.

Viva Harsha : ఈ షార్ట్ ఫిలిం గుర్తుందా? హర్షని సెలబ్రిటీగా మార్చిన వైవా.. 11 ఏళ్ళు పూర్తవడంతో ఎమోషనల్ పోస్ట్..

Viva Harsha shares Emotional Post on Viva Short Film for Completing 11 Years

Updated On : July 11, 2024 / 10:49 AM IST

Viva Harsha : ఇప్పుడంటే ఓటీటీలు వచ్చి వెబ్ సిరీస్ లు వచ్చాయి కానీ ఒకప్పుడు సినిమాలు, సీరియల్స్ కాకుండా అందరికి ఎంటర్టైన్మెంట్ కావాలంటే యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చూసేవాళ్ళు. గతంలో చాలా మంది షార్ట్ ఫిలిమ్స్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసేవాళ్ళు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఎంతోమంది సినిమాల్లోకి వచ్చి స్టార్స్ అయ్యారు. అందులో హర్ష ఒకరు.

మనందరికీ వైవా షార్ట్ ఫిలిం గుర్తు ఉండే ఉంటుంది. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక సర్ కొంతమంది స్టూడెంట్స్ ని వైవా అడుగుతాడు, చివర్లో అతను సర్ కాదని తెలుస్తుంది. ఇదంతా కూడా ఫుల్ కామెడీగా తెరకెక్కించారు. శబరీష్ కాండ్రేగుల దర్శకత్వంలో హర్ష, షణ్ముఖ్ జస్వంత్, రాఘవ.. ఇలా పలువురు కుర్రాళ్ళు కలిసి 11 ఏళ్ళ క్రితం ఈ షార్ట్ ఫిలిం ని తెరకెక్కించారు. ఈ షార్ట్ ఫిలిం ఓవర్ నైట్ పెద్ద హిట్ అయి ఇందులో నటించిన వాళ్లందరికీ మంచి పేరు తెచ్చింది. ముఖ్యంగా ఇందులో వైవా అడిగే పాత్రలో నటించిన హర్ష వైవా హర్షగా మారి కమెడియన్ గా సినీ పరిశ్రమలో దూసుకుపోతున్నాడు. తాజాగా నేటికి ఈ షార్ట్ ఫిలిం రిలీజ్ అయి 11 ఏళ్ళు అవుతుండటంతో హర్ష ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

Also Read : Samantha : సమంతని ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్‌తో మళ్ళీ సినిమా.. సెకండ్ ఇన్నింగ్స్‌కి బ్రేక్ ఇస్తాడా..?

వైవా హర్ష తాజాగా పెట్టిన పోస్ట్ లో.. ఇవాళ్టికి వైవా వచ్చి 11 ఏళ్ళు అవుతుంది. నా లైఫ్ ఛేంజింగ్ వీడియో ఇది. నాకు ఒక కొత్త పేరు వచ్చి, నాకు మీ అందరి ప్రేమాభిమానాలు రావడం మొదలయి 11 ఏళ్ళు అవుతుంది, ఇంకా కొనసాగుతుంది. నా ఫ్రెండ్, నన్ను కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చేలా చేసి ఇందులో నటించేలా చేసి, నా లైఫ్ కి ఒక డైరెక్షన్ ఇచ్చిన శబరీష్ కాండ్రేగులకు స్పెషల్ థ్యాంక్స్ అలాగే ఈ వీడియోలో నటించిన ప్రతి ఒక్కరికి, ఈ వీడియో ఇవాళ్టి కూడా చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ హృదయాల్లో నాకు ప్రత్యేక స్థానమిచ్చి ఒక చిన్న కుర్రాడ్ని తన డ్రీమ్స్ నెరవేరేలా చేసినందుకు మరొక్కసారి అందరికి ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చాడు.

 

View this post on Instagram

 

A post shared by Harsha (@harshachemudu)

ఇంకోసారి ఈ షార్ట్ ఫిలిం చూసి నవ్వేయండి..