Vivek Agnihotri : నేను, కంగనా రనౌత్ మాత్రమే బాలీవుడ్ ని ప్రశ్నిస్తున్నాం.. అందుకే మమ్మల్ని టార్గెట్ చేశారు..

తాజాగా వివేక్ అగ్నిహోత్రి ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దీంట్లో మరోసారి బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Vivek Agnihotri : నేను, కంగనా రనౌత్ మాత్రమే బాలీవుడ్ ని ప్రశ్నిస్తున్నాం.. అందుకే మమ్మల్ని టార్గెట్ చేశారు..

Vivek Agnihotri said Bollywood targeting me and Kangana Ranaut

Updated On : May 5, 2023 / 9:47 AM IST

Vivek Agnihotri :  బాలీవుడ్(Bollywood) లో గత కొన్నాళ్ల నుంచి నెపోటిజం(Nepotism), బాలీవుడ్ సినిమా మాఫియా గురించి, వాళ్ళు తీసే సినిమాల గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. బాలీవుడ్ లో ఉన్న పలువురు టాప్ హీరోలు, నిర్మాతలని, వారి ఫ్యామిలీలని కొన్ని విషయాలలో విమర్శిస్తూనే ఉంటారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్(Kangana Ranaut), కశ్మీర్ ఫైల్స్(Kashmir Files) డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.. మరి కొంతమంది బాలీవుడ్ మాఫియాపై రెగ్యులర్ గా కామెంట్స్ చేస్తూనే ఉంటారు.

తాజాగా వివేక్ అగ్నిహోత్రి ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దీంట్లో మరోసారి బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేక్ అగ్నిహోత్రి సినిమాల గురించి మాట్లాడుతూ.. నన్నైతే బాలీవుడ్ లో పూర్తిగా దూరం పెట్టారు. నాకు మధ్యతరగతి ప్రజల్లో, ఆడియన్స్ లో సపోర్ట్ వచ్చింది. బాలీవుడ్ సినిమాలు వాస్తవానికి దూరంగా ఉంటాయి. కరణ్ జోహార్ సినిమాల్లో చూపించినట్టు బయట దేశంలోని యువత అలా ఉండదు. ఒకప్పుడు సినిమాలు చూస్తే వాటికి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేవారు. ఇప్పటి సినిమాలకి కనెక్ట్ కావట్లేదు కాబట్టే ఎక్కువ పరాజయాలు చూస్తున్నారని, అందుకే ప్రేక్షకులు బాలీవుడ్ ని విమర్శిస్తున్నారని, బాయ్ కాట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

MS Dhoni : ధోని బయోపిక్ రీరిలీజ్.. థ్యాంక్యూ అంటున్న సుశాంత్ అభిమానులు..

అలాగే ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇప్పుడు బాలీవుడ్ లో కొంతమంది నన్ను, కంగనాని టార్గెట్ చేశారు. బాలీవుడ్ లో జరిగే తప్పులని మేమిద్దరమే ప్రశ్నిస్తాం కాబట్టి మమ్మల్ని దూరం పెడుతున్నారు. తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు మాకు ఉంది. అందుకే మా సినిమాలని, మమ్మల్ని టార్గెట్ చేసి, దూరం పెట్టి వేరు చేయాలనుకుంటున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు వివేక్ అగ్నిహోత్రి. మరి ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ లో ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.