Vivek Agnihotri : బాలీవుడ్ డైరెక్టర్ ట్వీట్.. ఫైర్ అవుతున్న సౌత్ అభిమానులు.. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్!

కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి చేసిన ట్వీట్స్ నెట్టింట రచ్చకి దారి తీస్తున్నాయి. సౌత్ అభిమానులు, ప్రభాస్ ఫ్యాన్స్ సీరియస్ అవుతూ.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

Vivek Agnihotri : బాలీవుడ్ డైరెక్టర్ ట్వీట్.. ఫైర్ అవుతున్న సౌత్ అభిమానులు.. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్!

Vivek Agnihotri viral tweets south and prabhas fans are serious

Updated On : July 8, 2023 / 4:50 PM IST

Vivek Agnihotri : సౌత్ సినిమాలు, స్టార్స్ ప్రస్తుతం ఇండియన్ టాప్ పొజిషన్ లో ఉండడంతో బాలీవుడ్ వాళ్ళు తెగ బాధ పడిపోతున్నారు. దీంతో అసహనంతో సౌత్ మూవీ అండ్ యాక్టర్స్ పై తమ ఈర్షని బహిరంగంగానే చూపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి చేసిన రెండు ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ దర్శకుడు ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో పాపులారిటీని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ ప్రభాస్ సలార్ రిలీజ్ రోజునే రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది.

Bro Movie : బ్రో ఫస్ట్ సింగల్ రిలీజ్.. ‘మై డియర్ మార్కండేయ’ సాంగ్ అదుర్స్..

కాగా జులై 6 తెల్లవారుజామున సలార్ టీజర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ రోజు ఉదయమే వివేక్ అగ్నిహోత్రి ఒక ట్వీట్ చేశాడు. “ప్రజలు ఎవరు హింసాత్మకంగా పుట్టరు. సాహిత్యం, సినిమా మరియు రాజకీయాలలో హింసను గ్లామరైజ్ చేయడం ద్వారా మీ పిల్లల మనస్సులు కలుషితం అవుతున్నాయి. అటువంటి హింసాత్మక ప్రపంచంలో సృజనాత్మక స్పృహ మాత్రమే పరిష్కారం” అంటూ ట్వీట్ చేశాడు.

అలాగే మరో నెటిజెన్ ట్వీట్ కి రిప్లై ఇస్తూ కూడా ఒక ట్వీట్ చేశాడు. “ఇప్పుడు సినిమాలో విపరీతమైన హింసను గ్లామరైజ్ చేయడం కూడా టాలెంట్‌గా భావిస్తున్నారు. అర్ధంలేని సినిమాలను ప్రోత్సహించడం పెద్ద టాలెంట్‌ అనుకుంటున్నారు. నటులు కానివారిని బిగ్గెస్ట్ స్టార్‌గా ప్రోత్సహించడం అతిపెద్ద టాలెంట్‌ అనే చెప్పాలి. ఇక ప్రేక్షకులకు ఏమి తెలియదు అనుకోవడం అతిపెద్ద టాలెంట్” అంటూ ట్వీట్ చేశాడు.

ఈ రెండు ట్వీట్స్ ని ప్రభాస్ అండ్ సలార్ ని దృష్టిలో పెట్టుకునే దర్శకుడి చేశాడు అంటూ ప్రభాస్ అభిమానులు వివేక్ అగ్నిహోత్రి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొంతమంది సౌత్ ఆడియన్స్ అయితే అగ్నిహోత్రి అంతకుముందు తీసిన A సర్టిఫికెట్ మూవీస్ చూపిస్తూ.. “దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది మీ కామెంట్స్ చూస్తుంటే” అంటూ కౌంటర్స్ ఇస్తున్నారు.