Maa Elections 2021 : ఎవడు పడితే వాడొచ్చి ‘మా’ లో కూర్చుంటే కుదరదు

ఆలు లేదు సులు లేదన్నట్లు ఆర్నెల్ల ముందే ప్రకాష్ రాజ్ పోటీ అంటూ వచ్చారు - వీకే నరేష్..

Maa Elections 2021 : ఎవడు పడితే వాడొచ్చి ‘మా’ లో కూర్చుంటే కుదరదు

Vk Naresh

Updated On : September 29, 2021 / 6:10 PM IST

మసకబారింది మా కాదు.. మీ మెదళ్లే

ప్రకాశ్ రాజ్ ఒక్కసారైనా మా ఎన్నికల్లో ఓటేశారా..?

ప్రకాశ్ రాజ్ నాకు మంచి ఫ్రెండ్ కానీ…

‘మా’ కు తెలుగోడే ప్రెసిడెంట్ గా ఉండాలి 

మంచు విష్ణు ప్యానెల్‌తో నరేష్  ప్రెస్ మీట్

Maa Elections 2021: ఎన్నడూ లేనంతంగా ఈ ఏడాది ‘మా’ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహ రావు అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండగా.. ఇండిపెండెంట్‌గా బండ్ల గణేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఇక నేడు మంచు విష్ణు మద్దతుగా ప్రస్తుత ఆపద్ధర్మ అధ్యక్షుడు వీకే నరేష్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

MAA Elections 2021 : పవన్ కళ్యాణ్ కామెంట్స్‌తో నేను ఏకీభవించట్లేదు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మా’ మసక బారింది.. అని కొందరు కామెంట్ చేసినప్పుడు మసక బారలేదు అని చెప్పాను.. నేను వెల్‌ఫేర్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఆరు నెలల పాటు సర్వే చేసి అవకాశాలు కల్పించాం. పదవి వ్యామోహాలు అనేవి ‘మా’ లో ఉండకూడదు.. పెద్దలు మంచి మైక్‌లో చెప్పండి.. చెడు చెవిలో చెప్పండి.. అన్న మాటలకు నేను నా నోటికి తాళం వేసుకుని కూర్చున్నాను.. ఒక పదకొండు మంది మీడియా ముందుకు వెళ్ళి జరగనిది, చెయ్యలేనివి అబద్ధాలు చెప్పుకొచ్చారు.. కరోనా టైం లో మా శాయ శక్తులా.. సభ్యులకు సేవ చేశాం.

MAA Elections 2021 : నేటితో నామినేషన్ల పర్వానికి తెర..

రెండు సంవత్సరాలు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పనులు చేశాం. ఈ మూడేళ్లలో ‘మా’ ముందుకు పోయింది కానీ మసక బారలేదు.. ‘మా’ కోసం నిలబడ్డాను.. ‘మా’ మసక బారలేదు.. మరింత ముందుకెళ్లింది.. ‘మా’ లో ప్రతి ఒక్కరూ సమానమే.. ‘మా’.. అవకాశాలు కల్పించడంతో పాటు, సభ్యుల కుటుంబానికి రక్షణగా ఉండాలి.. పదవీ వ్యామోహం ఉండకూడదు.. ‘మా’ రాజకీయ వేదిక కాదు.. ‘మా’ లో ఓ గ్రూప్‌తో స్పాన్సర్ టెర్రరిజం చేశారు.. మమ్మల్ని దెబ్బ కొట్టాలని చూశారు.. వారు అడ్డుపడ్డా పని చేశాం.. సంక్షేమ పథకాలను అందించాం..

‘మా’ కు మంచి వారసుడు మంచు విష్ణు..
ఆలు లేదు చూలు లేదన్నట్లు ఆర్నెల్ల ముందే ప్రకాష్ రాజ్ పోటీ అంటూ వచ్చారు.. ఎవడు పడితే వాడొచ్చి ‘మా’ లో కూర్చుంటే ‘మా’ మసక బారుతుంది. మంచు విష్ణు ఓ బ్రాండ్.. పరిశ్రమకు అన్నం పెట్టింది మంచు ఫ్యామిలీ.. తప్పు చేస్తే విష్ణు పారిపోయే వాడు కాడు పోరాడే వాడు.. ‘మా’ లో నాది కృష్ణుడి పాత్ర.. ‘మా’ కోసం విష్ణు రథం ఎక్కుతున్నా.. ‘మా’ కోసం విష్ణుకు నా పూర్తి మద్దతు తెలుపుతున్నాను’ అన్నారు.