Waltair Veerayya : ‘నీకేమో అందమెక్కువ’ సాంగ్ లాంచ్‌ని గ్రాండ్‌గా ప్లాన్ చేసిన వాల్తేరు వీరయ్య..

మెగాస్టార్ చిరంజీవి పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. కాగా ఇప్పుడు ఈ సినిమాలోని 5వ సాంగ్ ని లాంచ్‌ చేయడానికి గ్రాండ్ గా ప్లాన్ చేశాడు చిరంజీవి. ఈ సినిమాలోని నాలుగు పాటలని సింపుల్ గా రిలీజ్ చేసిన మేకర్స్.. ఈ పాటని మాత్రం గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి కారణం బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' ప్రమోషన్స్ అని తెలుస్తుంది.

Waltair Veerayya : ‘నీకేమో అందమెక్కువ’ సాంగ్ లాంచ్‌ని గ్రాండ్‌గా ప్లాన్ చేసిన వాల్తేరు వీరయ్య..

Waltair Veerayya fifth single released in grand way

Updated On : January 10, 2023 / 4:55 PM IST

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాలో మరో టాలీవుడ్ హీరో రవితేజ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. కె బాబీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవికి జోడిగా శృతిహాసన్ కనిపించబోతుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఇటీవల గ్రాండ్ గా జరుపుకుంది చిత్ర యూనిట్.

Waltair Veerayya: ఏపీలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమా టికెట్ ధరల పెంపు!

కాగా ఇప్పుడు ఈ సినిమాలోని 5వ సాంగ్ ని లాంచ్‌ చేయడానికి గ్రాండ్ గా ప్లాన్ చేశాడు చిరంజీవి. ‘నీకేమో అందమెక్కువ నాకేమో తొందరెక్కువ’ అంటూ సాగే ఈ సాంగ్ మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునేలా ఉండబోతుంది. ఈ సాంగ్ లాంచ్ ని హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహిస్తున్నారు. జనవరి 11న ఉదయం గం.10:35 నిమిషాలకు ఈ పాటని గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఈ సినిమాలోని నాలుగు పాటలని సింపుల్ గా రిలీజ్ చేసిన మేకర్స్.. ఈ పాటని మాత్రం గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి కారణం బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ ప్రమోషన్స్ అని తెలుస్తుంది. వీరసింహారెడ్డి టీజర్ అండ్ సాంగ్స్.. ఇలా ప్రతి దాని చాలా గ్రాండ్ గా నిర్వహించారు మూవీ టీం. వాల్తేరు వీరయ్య విషయంలో ఇలా లేకపోవడంతో, ఇటీవల మెగా ఫ్యాన్స్ హైదరాబాద్ లో మెగా మీట్ నిర్వహించి మెగా బ్రదర్ నాగబాబుకు ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో ఇప్పుడు ఈ 5వ సింగల్ గ్రాండ్ రిలీజ్ కి కారణం అభిమానుల ఆగ్రహమనే తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కేథ‌రిన్ థ్రెసా ఒక ముఖ్యపాత్ర పోషిస్తుండగా, ఊర్వశి రౌటెలా ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందు రాబోతుంది.