Waltair Veerayya: వాల్తేరు వీరయ్య సక్సెస్ సెలబ్రేషన్స్‌కు డేట్ ఫిక్స్.. ఎక్కడో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి.. బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేయగా, ఈ సినిమాలో ఊరమాస్ అవతారంలో బాస్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఇక ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కూడా నటించడంతో చిరు-రవితేజ కాంబినేషన్‌ను వెండితెరపై చూసేందుకు అభిమానులకు థియేటర్లకు పోటెత్తారు.

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య సక్సెస్ సెలబ్రేషన్స్‌కు డేట్ ఫిక్స్.. ఎక్కడో తెలుసా..?

Waltair Veerayya Success Celebrations Date And Venue Locked

Updated On : January 25, 2023 / 8:34 PM IST

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి.. బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేయగా, ఈ సినిమాలో ఊరమాస్ అవతారంలో బాస్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఇక ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కూడా నటించడంతో చిరు-రవితేజ కాంబినేషన్‌ను వెండితెరపై చూసేందుకు అభిమానులకు థియేటర్లకు పోటెత్తారు.

Waltair Veerayya : 2.25 రేటింగ్ ఇచ్చారు.. నేడు 2.25 మిలియన్స్ సాధించింది.. చిరంజీవి!

సంక్రాంతి బరిలో మెగా బ్లాక్‌బస్టర్ మూవీగా ఏకంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో వాల్తేరు వీరయ్య దుమ్ములేపింది. ఈ సినిమా సక్సెస్‌తో చిత్ర యూనిట్ సంతోషంగా ఉన్నారు. అటు మెగాస్టార్ కూడా ‘ఖైదీ నెంబర్ 150’ తరువాత అంతకు మించిన సక్సెస్ రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ప్రేక్షకులు అందించిన మెగా సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు వాల్తేరు వీరయ్య టీమ్ రెడీ అవుతోంది.

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ ఊచకోత.. పది రోజుల్లోనే డబుల్ సెంచరీ!

ఈ చిత్ర సక్సెస్ సెలబ్రేషన్స్‌ను జనవరి 28న వరంగల్ హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. వీరయ్య విజయ విహారంను అభిమానులతో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు తాము రెడీగా ఉన్నామని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక వాల్తేరు వీరయ్య సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించగా, ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది.