Waltair Veerayya : 2.25 రేటింగ్ ఇచ్చారు.. నేడు 2.25 మిలియన్స్ సాధించింది.. చిరంజీవి!

మాస్ మూలవిరాట్ గా మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ వద్ద తాండవం ఆడిన సినిమా 'వాల్తేరు వీరయ్య'. కె బాబీ తెరకెక్కించిన ఈ సినిమాకి అనేక వెబ్ సైట్ లు నుంచి నెగటివ్ రివ్యూలు వచ్చాయి. తాజాగా వీటిపై చిరు సెటైర్లు వేశాడు.

Waltair Veerayya : 2.25 రేటింగ్ ఇచ్చారు.. నేడు 2.25 మిలియన్స్ సాధించింది.. చిరంజీవి!

Waltair Veerayya

Waltair Veerayya : మాస్ మూలవిరాట్ గా మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ వద్ద తాండవం ఆడిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో చిరు.. వింటేజ్ లుక్స్, డాన్స్, యాక్షన్ తో అదరగొట్టేశాడు. కె బాబీ తెరకెక్కించిన ఈ సినిమాకి అనేక వెబ్ సైట్ లు నుంచి నెగటివ్ రివ్యూలు వచ్చాయి. అయినా సరే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఓవర్ సీస్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా వాల్తేరు వీరయ్య రికార్డులు సృష్టిస్తున్నాడు.

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ ఊచకోత.. పది రోజుల్లోనే డబుల్ సెంచరీ!

దీంతో చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆ ఆనందాన్ని అమెరికన్ ఆడియన్స్ తో పంచుకున్నాడు. ఆన్‌లైన్ ద్వారా యూఎస్‌ఏ ఫ్యాన్స్ తో ఇంటర్యాక్ట్ అయ్యాడు చిరంజీవి. ఈ ఇంటరాక్షన్ లో చిరంజీవి.. వాల్తేరు వీరయ్యకి తక్కువ రేటింగ్ ఇచ్చిన కొన్ని వెబ్ సైట్స్ పై సెటైర్లు వేశాడు. ‘నేను మీకు ఒక జోక్ చెబుతాను. ఎవరిని విమర్శిచాలి అనే ఉద్దేశం కాదు, కేవలం సరదా కోసం చెబుతున్నా. సినిమా రిలీజ్ అయ్యినప్పుడు కొన్ని వెబ్ సైట్లు 2.25 రేటింగ్ ఇచ్చాయి. అవి చూసి నేను ఏ మాత్రం బాధ పడలేదు.

ఎందుకంటే ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్, అన్నయ్య, రౌడీ అల్లుడు లాంటి సినిమాల్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఇచ్చాము. ఆ సినిమాలు మాదిరి ఈ మూవీ కూడా హిట్టు అవుతుంది అని కాన్ఫిడెంట్ గా ఉన్నాను. అలాగే హిట్టు అయ్యింది. అయితే నాకు ఇప్పుడు అర్ధమైంది. ఆ వెబ్ సైట్లు ఇచ్చింది సినిమా రేటింగ్ కాదని. అది 2.25 మిలియన్స్ మూవీ కలెక్షన్స్ అని’ అంటూ సెటైర్ వేశాడు. ఈ చిత్రం ఓవర్ సీస్‌లో 2.25 మిలియన్స్ కలెక్షన్స్ రాబట్టింది. టోటల్ వరల్డ్ వైడ్ గా కేవలం 10 రోజుల్లో ఈ సినిమా రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించింది.