Want To Participate Sudigali Sudheer Aha Sarkaar Show Here Details
Aha Sarkaar : సుడిగాలి సుధీర్ హోస్ట్ గా ఆహా ఓటీటీలో సర్కార్ సీజన్ 5 మొదలయింది. ఆల్రెడీ ప్రోమోలతో ఈ షోపై ఆసక్తి కలిగించగా సర్కార్ సీజన్ 5 మొదటి ఎపిసోడ్ నిన్న జూన్ 6 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ రాత్రి 7 గంటలకు ఆహా ఓటీటీలో రానుంది. సాధారణంగా ఈ షోలో సెలబ్రిటీలు వచ్చి ఆడి సందడి చేస్తారు.
అయితే ఈసారి సాధారణ ప్రేక్షకులు కూడా ఈ షోలో ఇంటినుంచి పాల్గొనచ్చు. సర్కార్ సీజన్ 5లో సరికొత్త సెగ్మెంట్ ఇంట్రడ్యూస్ చేసారు. ఈ గేమ్ షోలో ప్రేక్షకులు తమ ఇంటి వద్ద నుంచే పాల్గొనవచ్చు. ఆహాలో ఈ గేమ్ షో చూస్తూ డిస్ ప్లే అయ్యే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మీకు పంపిన ప్రశ్నలకు సరైన సమాధానాలు వాట్సాప్ ద్వారా పంపితే సర్ ప్రైజ్ గిఫ్ట్ లు గెల్చుకోవచ్చు. మీరు కూడా ఆహా ఓటీటీలో గేమ్ షో చూసి ఆడేయండి..