Jio Cinemas : మొన్న IPL.. ఇప్పుడు HBO.. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’తో జియో సినిమాస్!

IPL ని ఫ్రీగా ఇస్తూ దేశంలో పాపులర్ అయిన జియో సినిమాస్ ఇటీవల Voot కంటెంట్ ని సొంత చేసుకుంది. ఇప్పుడు హాట్ స్టార్ కంటెంట్ ని కూడా..

Jio Cinemas : మొన్న IPL.. ఇప్పుడు HBO.. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’తో జియో సినిమాస్!

Warner Bros and HBO movies and series telecasted on Jio Cinemas

Updated On : April 27, 2023 / 4:35 PM IST

Jio Cinemas : జియో (Jio) సంస్థ ఓటిటి రంగంలోకి అడుగు పెడుతూ జియో సినిమాస్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇక దేశంలో ఎక్కువ ఇష్టపడే IPL ని ఫ్రీ టెలికాస్ట్ ఇస్తూ ఒక్కసారిగా పాపులారిటీని సంపాదించుకుంది. ఈ ఏడాది మాత్రమే కాదు ఏకంగా నాలుగేళ్లపాటు కూడా IPL ను ఫ్రీగా చూడవచ్చు అంటూ ప్రకటించి ఐపీయల్ లవర్స్ ని ఖుషీ చేసింది. ఇక ఇటీవలే జియో సినిమా యాప్ కోసం జియో స్టూడియోస్ దేశవ్యాప్తంగా దాదాపు 100 సినిమాలు, సిరీస్ లతో ఒప్పందం కుదుర్చుకుంది.

Samantha : ఆక్సిజన్ మాస్క్ తో సమంత.. మళ్లీ ఏమైంది?

మే మూడో వారం నుంచి ఇవన్నీ జియో సినిమాస్ లో అందుబాటులోకి రానున్నాయి. జియో సినిమాస్ ని దేశంలో అతిపెద్ద ఓటిటిగా మార్చేందుకు జియో మేనేజ్మెంట్ చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రముఖ ఓటీటీ వూట్ ని (Voot) జియో సినిమాస్ లో కలిపేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వూట్ కంటెంట్ మొత్తం జియో సినిమాస్ లో అందుబాటులోకి వచ్చేసింది. తాజాగా మరో ఓటిటి ప్లాట్ ఫార్మ్ హాట్ స్టార్ కంటెంట్ ని కూడా లాగేసుకుంది. హాట్ స్టార్ లో ప్రసారమయ్యే Warner Bros, HBO కంటెంట్ ఇక నుంచి జియో సినిమాస్ టెలికాస్ట్ చేయనుంది. Succession, Game of Thrones వంటి సూపర్ హిట్ సిరీస్ తో పాటు మరిన్నో జియో సినిమాస్ లో అందుబాటులోకి రానున్నాయి.

Akhil Akkineni : అక్కినేని కంటే అయ్యగారు అఖిల్.. నాకు ఓకే.. అఖిల్ అక్కినేని!

కాగా IPL ని ఫ్రీగా టెలికాస్ట్ చేస్తున్న జియో సినిమాస్ మూవీ కంటెంట్ ని మాత్రం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ తో అందిస్తున్నారు. ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ కి సంబంధించిన వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోజువారీ సబ్‌స్క్రిప్షన్ ని పరిచయం చేస్తూ రోజుకి 2 రూపాయలు మాత్రమే తీసుకొని 2 డివైజ్ లు ఉపయోగించుకునేలా సబ్‌స్క్రిప్షన్ ఇవ్వనున్నట్లు సమాచారం. 99 రూపాయలకు మూడు నెలల సబ్‌స్క్రిప్షన్, 599 రూపాయలతో సంవత్సరం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ని ఇవ్వనుందని సమాచారం.దీనిపై జియో సినిమాస్ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.