Movie Theater : ఫ్యామిలీతో కలిసి చూసేలాగా అద్దెకు సినిమా థియేటర్..

కేవలం ఒక ఫ్యామిలీ మాత్రమే సినిమా చూసేలా స్టార్‌ ట్రాక్‌ గ్రూప్‌ హైదరాబాద్‌లో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఒక చిన్న థియేటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ థియేటర్‌ను అద్దెకు.......

Movie Theater : ఫ్యామిలీతో కలిసి చూసేలాగా అద్దెకు సినిమా థియేటర్..

Movie Theater

Updated On : January 5, 2022 / 10:48 AM IST

Movie Theater :   కరోనా తర్వాత సినీ పరిశ్రమకు, థియేర్లకు పెద్ద దెబ్బె తగిలింది. దానికి తోడు మళ్ళీ మళ్ళీ లాక్ డౌన్ పడుతుండటం, థియేటర్ మైంటెయినెన్స్ పెరగడం, ప్రేక్షకులు వస్తారో రారో అనే భయం.. ఇలాంటి వాటితో థియేటర్లు నడపడం చాలా కష్టం అంటున్నారు థియేటర్ యాజమాన్యాలు. కొన్ని థియేటర్స్ ని మూసేస్తున్నారు కూడా. అయితే ఇలాంటి సమయంలో ఓ థియేటర్స్ గ్రూప్ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. కేవలం ఒక ఫ్యామిలీ మాత్రమే సినిమా చూసేలా స్టార్‌ ట్రాక్‌ గ్రూప్‌ హైదరాబాద్‌లో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఒక చిన్న థియేటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ థియేటర్‌ను అద్దెకు తీసుకుని మనకి నచ్చిన సినిమాను ఫ్యామిలీతో చూసేయొచ్చు. ఈ ఫ్యామిలీ థియేటర్‌ను రోజుకు మూడు షోలకు అద్దెకు ఇస్తున్నారు. షో టైమింగ్‌, వారాన్ని బట్టి ఒక్కో షోకి కనిష్టంగా రూ.1500ల నుంచి రూ.1900ల వరకు వసూలు చేస్తున్నారు. ఒక ఫ్యామిలీ అంతా కలిసి రిలీజ్ సినిమాకి వెళ్లినా దాదాపు ఇంతే ఖర్చు అవుతుంది. అంతే కాక ఈ రెంటెండ్‌ థియేటర్‌లో కరోనా భయాలు లేకుండా సినిమాలను చూడొచ్చు. మల్టీప్లెక్స్ స్థాయిలో నిర్మించిన ఈ థియేటర్‌లో ఏడుగురు కుటుంబ సభ్యుల వరకు సినిమా చూసే ఛాన్స్ ఉంది.

Mahesh Babu : ‘పుష్ప’ సినిమాపై మహేష్‌బాబు రివ్యూ

ప్రతీ షో తర్వాత థియేటర్‌ మొత్తాన్ని ఆధునిక పద్దతిలో శానిటైజ్‌ చేస్తున్నారు. ఈ ఫ్యామిలీ థియేటర్‌లో సినిమాలే కాక మనకి నచ్చిన వీడియోలు, ఫ్యామిలీ ఫంక్షన్ వీడియోలు కూడా చూడొచ్చు. 142 ఇంచెస్‌ ఆధునిక స్క్రీన్‌, పవర్‌ఫుల్ ఆడియో సిస్టమ్‌, రిక్లెయినర్‌ చైయిర్లు ఇందులో ఉన్నాయి. సికింద్రాబాద్‌ సర్థార్‌పటేల్‌ రోడ్‌లో ఉన్న ఈ థియేటర్‌లో ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలంటే స్టార్‌ ట్రాక్‌ గ్రూప్‌కి చెందిన వెబ్‌సైట్‌కి వెళ్లి షోని బుక్‌ చేసుకోవాలి. ఈ ఐడియా బాగుండటంతో ఇప్పటికే చాలా మంది ఫ్యామిలీలు ఈ థియేటర్ కి వెళ్తున్నారంట.