We Love Bad Boys : ‘వి లవ్ బ్యాడ్ బాయ్స్’ వాలెంటైన్స్ డే స్పెషల్ ఫస్ట్ లుక్ రిలీజ్..

యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా 'వి లవ్ బ్యాడ్ బాయ్స్'.

We Love Bad Boys Movie First Look Released on Valentines Day

We Love Bad Boys : బి.ఎమ్.క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీమతి పప్పుల వరలక్ష్మి సమర్పణలో పప్పుల కనక దుర్గారావు నిర్మాణంలో రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ‘వి లవ్ బ్యాడ్ బాయ్స్’ (We love Bad Boys).

ఆల్రెడీ సినిమా పూర్తిచేసుకొని సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది ఈ సినిమా. కడుపుబ్బే ఎంటర్టైనర్ గా తెరకెక్కిన వి లవ్ బ్యాడ్ బాయ్స్ సినిమా ఫస్ట్ లుక్ నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా మూవీ యూనిట్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అజయ్, వంశీ ఏకశిరి, రోమిక శర్మ, రోషిణి సహోట, ప్రగ్యా నయన్, పోసాని కష్ణమురళి, కాశి విశ్వనాథ్, అలీ, సప్తగిరి, పృథ్వి, శివారెడ్డి, భద్రం, గీతాసింగ్.. తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Also Read : Chiranjeevi : ‘విశ్వంభర’ షూట్ కి బ్రేక్ ఇచ్చి.. వాలెంటైన్స్ డే రోజు భార్యతో కలిసి మెగాస్టార్ ఎక్కడికి వెళ్లారో తెలుసా?

యూత్ అంశాలతో పటు ఆద్యంతం నవ్వించే కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కించినట్టు డైరెక్టర్ రాజు రాజేంద్రప్రసాద్ తెలిపారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించి ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారు.