Chiranjeevi : ‘విశ్వంభర’ షూట్ కి బ్రేక్ ఇచ్చి.. వాలెంటైన్స్ డే రోజు భార్యతో కలిసి మెగాస్టార్ ఎక్కడికి వెళ్లారో తెలుసా?

తాజాగా చిరంజీవి విమానంలో తన భార్య సురేఖతో కలిసి దిగిన ఫొటోని షేర్ చేశారు.

Chiranjeevi : ‘విశ్వంభర’ షూట్ కి బ్రేక్ ఇచ్చి.. వాలెంటైన్స్ డే రోజు భార్యతో కలిసి మెగాస్టార్ ఎక్కడికి వెళ్లారో తెలుసా?

Megastar Chiranjeevi Travelling with her Wife Surekha on Valentines Day

Updated On : February 14, 2024 / 11:44 AM IST

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర(Vishwambhara) సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. ఈ సోషియో ఫాంటసీగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ షూట్ కి బ్రేక్ ఇచ్చి భార్యతో కలిసి ట్రిప్ కి వెళ్తున్నారు చిరంజీవి. తాజాగా చిరంజీవి విమానంలో తన భార్య సురేఖతో కలిసి దిగిన ఫొటోని షేర్ చేశారు.

చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి దిగిన ఫోటో షేర్ చేస్తూ.. అమెరికాకు ఒక చిన్న హాలిడే ట్రిప్ వేస్తున్నాను నా భార్య సురేఖతో కలిసి. నేను తిరిగి వచ్చాక మళ్ళీ విశ్వంభర షూట్ మొదలుపెడతాను. త్వరలోనే మీ అందర్నీ కలుస్తాను. అలాగే మీకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. అయితే చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపికైనందుకు అమెరికాలో తెలుగువారు, మెగా ఫ్యాన్స్ నిర్వహిస్తున్న సన్మానం అందుకోడానికి వెళ్తున్నట్టు సమాచారం.

Also Read : Naga Chaitanya – Sai Pallavi : వాలెంటైన్స్ డే స్పెషల్ రీల్.. నాగ చైతన్య ఇక్కడ.. సాయి పల్లవి అక్కడ.. ఎంత క్యూట్‌గా ఉందో..

ఇక ఇటీవల చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు, ప్రముఖులు మెగాస్టార్ కి అభినందనలు చెప్తున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించింది.