Arjun Kapoor : చెల్లెళ్ళతో రిలేషన్ గురించి అర్జున్ కపూర్ కామెంట్స్..

నాన్న, శ్రీదేవిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ ‘మీ న్యూ మమ్మీ ఎలా ఉంది’ అని అడిగేవారు..

Arjun Kapoor : చెల్లెళ్ళతో రిలేషన్ గురించి అర్జున్ కపూర్ కామెంట్స్..

We Still Are Different Families Says Actor Arjun Kapoor

Updated On : July 3, 2021 / 4:21 PM IST

Arjun Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ పెళ్లి అప్పట్లే సెన్సేషన్. మొదటి భార్య మోనా కపూర్.. పిల్లలు అర్జున్, అన్షులా ఉండగానే బోనీ, శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. శ్రీదేవి మరణం తర్వాత అనూహ్యంగా అర్జున్ కపూర్, అన్షులా కపూర్ ఇద్దరూ చెల్లెల్లు జాన్వీ, ఖుషిలకు దగ్గరయ్యారు. కాగా ఇప్పటికీ తాము వేర్వేరు ఫ్యామిలీస్ అంటూ అర్జున్ కపూర్ రీసెంట్‌గా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Janhvi Kapoor : జాన్వీ ఎంట్రీకి లైన్ క్లియర్ చేసిన సూపర్ స్టార్..!

నాన్న, శ్రీదేవిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ ‘మీ న్యూ మమ్మీ ఎలా ఉంది’ అని అడిగేవారు.. అప్పుడు మనసులో చాలా బాధ అనిపించేది. జాన్వీ, ఖుషి పుట్టినతర్వాత 20 ఏళ్లకు మేం కలిశాం. మా జీవితంలో రెండు బాధాకరమైన సంఘటనలు (అర్జున్ తల్లి మోనా కపూర్, జాన్వీ, ఖుషీల తల్లి శ్రీదేవి) మరణించడం. ఇప్పటికీ మేం వేర్వేరు కుటుంబాల్లా ఉంటాం (నివసిండం గురించి) కానీ మా నాన్న జీన్స్ వల్ల మేం కలిసే ఉంటామంటూ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు అర్జున్ కపూర్.

సినిమాల విషయానికొస్తే హిందీ ‘పింక్’ రీమేక్‌తో తమిళ్ (అజిత్ హీరోగా ‘నేర్కొండపార్వై) తెలుగు రీమేక్ ‘వకీల్ సాబ్’ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు నిర్మాత బోనీ కపూర్. అర్జున్ ‘భూత్ పోలీస్’, ‘ఏక్ విలన్ రిటర్న్స్’ సినిమాలు చేస్తున్నాడు. జాన్వీ ‘దోస్తానా 2’, ‘గుడ్ లక్ జెర్రీ’ మూవీస్ చేస్తోంది. జాన్వీ చెల్లెలు ఖుషి కపూర్ త్వరలో బాలీవుడ్‌లో ఇంట్రడ్యూస్ కానుందని తెలుస్తోంది.

Thala Ajith Kumar : ముచ్చటగా మూడోసారి.. ‘వలిమై’ విడుదలకు ముందే ‘తల’ 61 ప్రారంభం..!