Janhvi Kapoor : జాన్వీ ఎంట్రీకి లైన్ క్లియర్ చేసిన సూపర్ స్టార్..!

టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్న బాలీవుడ్ భామ జాన్వీ ఎంట్రీ ఎప్పుడు..? రెండేళ్ల నుంచి ఈ టాపిక్ మీద సోషల్ మీడియాలో రకరకాల వార్తలు నడుస్తున్నాయి..

Janhvi Kapoor : జాన్వీ ఎంట్రీకి లైన్ క్లియర్ చేసిన సూపర్ స్టార్..!

Janhvi Kapoor

Janhvi Kapoor: టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్న బాలీవుడ్ భామ జాన్వీ ఎంట్రీ ఎప్పుడు..? రెండేళ్ల నుంచి ఈ టాపిక్ మీద సోషల్ మీడియాలో రకరకాల వార్తలు నడుస్తున్నాయి. అయితే ఈ సారి మాత్రం ఈ క్రేజీ బాలీవుడ్ హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం గట్టిగానే సిద్ధం చేస్తున్నారు సూపర్ స్టార్.

అదిగో స్క్రిప్ట్ వినేసింది.. ఇదిగో ఓకే అనేసింది అంటూ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి కానీ, ఇంతవరకూ ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు. ఈ సారి మాత్రం పక్కా ప్లాన్‌తో జాన్వీ ఎంట్రీ ప్లాన్ చేశారట. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఆల్ మోస్ట్ ఫిక్స్ అయిపోయిందంటూ వార్తలు విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ సినిమా కంటే ముందే మహేష్ -రాజమౌళి కాంబినేషన్లో చేసే సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ అంటూ మీడియాలో వార్తలు హడావిడి చేశాయి.

జాన్వీ తెలుగులో కూడా సినిమాలు చెయ్యడానికి రెడీగా ఉందని, మంచి స్క్రిప్ట్ దొరికితే టాలీవుడ్‌లో తప్పకుండా ఎంట్రీ ఇస్తుందని ఆల్రెడీ అనౌన్స్ చేశారు తండ్రి బోనీకపూర్. దాంతో తెలుగు ఆడియన్స్‌కి జాన్వీని ఎప్పుడెప్పుడు తెరమీద చూద్దామా అన్న ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. నిజానికి మహేష్ బాబు కన్నా ముందే ప్రస్తుతానికి పోస్ట్ పోన్ అయిన ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాలో జాన్వీ తెలుగు తెరకు పరిచయం అవుతోందంటూ గాసిప్స్ వినిపించాయి.

టాలీవుడ్‌లో జాన్వీకి మంచి క్రేజ్ ఉంది. అందుకే జాన్వీ తెలుగు ఎంట్రీ గురించి రెండేళ్ల నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న కరణ్ జోహార్.. ఈ రౌడీ సరసన జాన్వీని లాంచ్ చేస్తాడేమో అనుకున్నారు. ఎందుకంటే జాన్వీకి కూడా విజయ్ అంటే విపరీతమైన ఇష్టం. సో.. ఈ క్రేజీ కాంబినేషన్‌తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తుందేమో అనుకున్నారు కానీ అది కూడా జరగలేదు. ఈ సారి ఈ రూమర్ మాత్రం నిజమైతే.. సూపర్ స్టార్ సరసన జాన్వీ ఎంట్రీ అదిరిపోతుందంటూ ఆనందపడిపోతున్నారు ఫ్యాన్స్..