Film Federation: నిర్మాతలు ఏం చెబుతారో విని డిసైడ్ అవుతాము, వాళ్లు కూడా బాగుండాలి- ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని
టీజీ విశ్వ ప్రసాద్ చెప్పింది తప్పు. స్కిల్స్ లేదు అనడం కరెక్ట్ కాదు. స్కిల్ లేకుండా ఇంతవరకు ఇండస్ట్రీ వస్తుందా?

Film Federation: ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫీస్ లో 24 క్రాఫ్ట్ యూనియన్ ప్రెసిడెంట్స్ అత్యవసరంగా సమావేశమైంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సభ్యులు సమావేశమైనట్లు తెలుస్తోంది. అన్ని సంఘాలతో చర్చలు జరిపామని ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని తెలిపారు. నిర్మాతలు కొన్ని రూల్స్ చెప్పారని, వాటికి అంగీకరిస్తే మాకు ఓకే అని నిర్మాతలు అన్నారని అనిల్ చెప్పారు.
నిర్మాతలు చెప్పేది అర్థం కాలేదన్నారు. కాల్ షీట్స్ గురించి కూడా చెప్పారు, హవర్స్ లెక్క ఏదో చెబుతున్నారు.. అర్థం కాలేదన్నారు. నాన్ మెంబర్స్ గురించి మాట్లాడారు, ఇది కూడా చర్చించాలన్నారు. సండేలు, హాలిడేస్, సింగిల్ కాల్ షీట్స్ అన్నారు. ఇది కూడా అర్థం కాలేదన్నారు. మీకు అర్థం కాకపోతే రేపు ఉదయం రండి… మీకు క్లియర్ గా చెబుతాము అని నిర్మాతలు చెప్పినట్లు అనిల్ తెలిపారు. నిర్మాతలు ఏం చెబుతారో వివరంగా విని మేము డిసైడ్ అవుతాము అని అనిల్ పేర్కొన్నారు.
”24 శాఖల్లో 24 మంది ఉన్నారు. నిర్మాత కూడా బాగుండాలనే అనుకుంటున్నాము. టీజీ విశ్వ ప్రసాద్ చెప్పింది తప్పు. స్కిల్స్ లేదు అనడం కరెక్ట్ కాదు. స్కిల్ లేకుండా ఇంతవరకు ఇండస్ట్రీ వస్తుందా? సభ్యత రుసుము అనేది అంతర్గతం. రుసుము తీసుకున్నా దాన్ని యూనియన్ వాళ్ళకే ఆపదలో ఖర్చు చేస్తాము” అని ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని అన్నారు.
తెలుగు ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రావడం లేదు. చర్చలు విఫలం కావడంతో మూడో రోజు సినీ కార్మికుల బంద్ కొనసాగుతోంది. అటు వేతనాలు పెంచే వరకు తగ్గేదే లేదని అంటున్నారు కార్మికులు.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాతలు, కార్మికుల మధ్య వేతనాల పెంపు వివాదం మరింత ముదురుతోంది. 30శాతం వేతనాలు కచ్చితంగా పెంచాలనే పట్టుదలతో కార్మికులు ఉండగా, ఈ విషయంలో అస్సలు తగ్గేదేలే అని నిర్మాతలు అంటున్నారు. కార్మికులు ఇటు లేబర్ కమిషన్ చెంతకు వెళ్లగా, నిర్మాతలేమో ఈ పంచాయితీని మెగాస్టార్ చిరంజీవి వద్దకు తీసుకెళ్లారు.
Also Read: ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిలో వేతనాలు పెంచలేము.. మైత్రీ నిర్మాత కామెంట్స్ వైరల్..