బాబోయ్.. రష్మిక రెచ్చిపోయిందిగా!
ఆకట్టుకుంటున్న ‘భీష్మ’ మూవీలోని ‘వాట్టే బ్యూటీ’ సాంగ్ ప్రోమో.. సినిమా ఫిబ్రవరి 21న గ్రాండ్ రిలీజ్..

ఆకట్టుకుంటున్న ‘భీష్మ’ మూవీలోని ‘వాట్టే బ్యూటీ’ సాంగ్ ప్రోమో.. సినిమా ఫిబ్రవరి 21న గ్రాండ్ రిలీజ్..
యంగ్ హీరో నితిన్, వరుస విజయాలతో మంచి జోరుమీదున్న కన్నడ చిన్నది రష్మిక జంటగా.. ‘ఛలో’ మూవీతో ఆకట్టుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో.. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న బ్యూటిఫుల్ లవ్ స్టోరి ‘భీష్మ’ (సింగిల్ ఫరెవర్).. ఇటీవల విడుదల చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది.
శుక్రవారం సాయంత్రం ‘వాట్టే బ్యూటీ వీడియో ప్రోమో రిలీజ్ చేశారు. నితిన్, రష్మికల కెమిస్ట్రీ, నితిన్ స్టెప్స్ చాలా బాగున్నాయి. ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ లో హీ ఈజ్ సో క్యూట్ పాటలో తన స్టెప్స్‌తో అలరించిన రష్మిక ఈ ‘వాట్టే బ్యూటీ ప్రోమోలో మాత్రం తన మూమెంట్స్‌తో అదరగొట్టేసింది. జస్ట్ ప్రోమోలోనే ఈ రేంజ్‌లో ఇరగదీస్తే ఇక ఫుల్ సాంగ్‌లో ఎలా చేసుంటుందో చూస్కోండి మరి.. ఈ ప్రోమోకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఫిబ్రవరి 2న ఈ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేయనున్నారు.
Read Also : సూపర్ స్టార్‌తో లేడి సూపర్ స్టార్ – ఏకంగా అయిదో సారి!
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరి 21న ‘భీష్మ’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘లై’, ‘ఛల్ మోహనరంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి వరుస పరాజయాల తర్వాత చేస్తున్న ‘భీష్మ’ మూవీపైనే నితిన్ ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రానికి సంగీతం : మహతి స్వర సాగర్, కెమెరా : సాయి శ్రీరామ్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : సాహి సురేష్.