‘ఆర్ఆర్ఆర్’ దర్శకుడు ఎవరు? ఒక్కరు కాదు ఇద్దరంటున్న గూగుల్ తల్లి

‘RRR’ సినిమా దర్శకుడు ఎవరు అంటే తడబడుతున్న గూగుల్ తల్లి..

  • Published By: sekhar ,Published On : February 23, 2020 / 10:24 AM IST
‘ఆర్ఆర్ఆర్’ దర్శకుడు ఎవరు? ఒక్కరు కాదు ఇద్దరంటున్న గూగుల్ తల్లి

Updated On : February 23, 2020 / 10:24 AM IST

‘RRR’ సినిమా దర్శకుడు ఎవరు అంటే తడబడుతున్న గూగుల్ తల్లి..

రాజమౌళి ఎవరు.. ఈ ప్రశ్నడిగితే బహుశా ఏ గ్రహాంతరవాసో అయింటాడనుకుంటారు. ‘బాహుబలి : ది బిగినింగ్’, ‘బాహుబలి : ది కన్‌క్లూజన్’ సినిమాలతో యావత్ ప్రపంచం చూపు తెలుగు సినిమా వైపు తిప్పాడు దర్శకధీరుడు రాజమౌళి. మన సినిమాని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లి, తెలుగు సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుని, గౌరవాన్ని తీసుకొచ్చాడు. రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘#RRR’..

స్వాతంత్ర్య నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరంభీమ్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటినుంచి ఇప్పటివరకు ఈ చిత్రంపై రకారకాల పుకార్లు, వార్తలు వస్తున్నాయి.. ఇటీవలే రామ్ చరణ్, అలియా భట్ పిక్స్ వైరల్ అయ్యాయి. తాజాగా ‘#RRR’ చిత్రానికి దర్శకుడు ఎవరు అంటే రాజమౌళితో పాటు మరో డైరెక్టర్ పేరు కూడా కనిపిస్తోంది. ఇందుకు గూగుల్ తల్లే సాక్ష్యం.

గూగుల్‌లో ‘RRR’ డైరెక్టర్ అని టైప్ చేస్తే రాజమౌళితో పాటు సంజయ్ పాటిల్ పేరు కూడా కనిపిస్తోంది. ఇంతకీ సదరు సంజయ్ పాటిల్ ఎవరయ్యా అంటే గూగుల్ అదిమాత్రం చూపించడం లేదు. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతోంది. గూగుల్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఇద్దరు దర్శకుల పేర్లు చూపిస్తుండడంతో ఫ్యాన్స్ అయోమయానికి గురవుతున్నారు. ‘RRR’ 2021 జనవరి 8న పది భాషల్లో విడుదల కానుంది.

Who Is The Director Of RRR Movie