Who gave negative publicity to Game Changer
Gossip Garage : బ్యాడ్ పబ్లిసిటీ.. ఇప్పుడిదే టాలీవుడ్‌ను వేధిస్తున్న అతిపెద్ద ఇష్యూ. స్టార్ హీరోలతో సినిమా తీస్తున్న డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు అయితే నెగెటివ్ టాక్ అనేది పెద్ద తలనొప్పిగా మారింది. స్టార్ వార్ పీక్‌కు చేరటం..తమ హీరోకు..మరో హీరోకు గిట్టదని ఫ్యాన్స్ రెచ్చిపోతుండటంతో ప్రొడ్యూసర్లు నిండా మునుగుతున్నారు. ఫస్ట్ షో పడక ముందే బ్యాడ్ పబ్లిసిటీ చేయడం, రిలీజ్ తర్వాత నెగిటివ్ రివ్యూలు రావడంతో ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమాలు ఫ్లాప్‌లుగా నిలుస్తున్నాయంటున్నారు. కొందరు హీరోల ఫ్యాన్స్ అయితే పనిగట్టుకుని మరీ నెగెటివ్ ప్రాపగండ చేస్తున్నారట.
ఈ నేపథ్యంలోనే అసలు ఎప్పుడూ నోరు విప్పని నిర్మాత శిరీష్ చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో సంచలనం అవుతున్నాయి. జనవరి 10న గేమ్‌ఛేంజర్ సినిమా రిలీజ్ అయింది. దిల్‌రాజు తన బ్యానర్‌లో నిర్మించిన సినిమాల్లో ఏ మూవీకి కూడా ఈ స్థాయిలో బడ్జెట్, టైమ్ కేటాయించలేదు.
Laila Teaser : విశ్వక్ సేన్ లైలా టీజర్ వచ్చేసింది..
ఈ సినిమాలో సాంగ్స్‌కు అయిన ఖర్చుతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా కంప్లీట్ చేశారంటే గేమ్‌ఛేంజర్‌పై ఎంత నమ్మకంతో అంత బడ్జెట్ పెట్టారో అర్ధం చేసుకోవచ్చు. కానీ చాలామంది సినీ పెద్దలు సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేశారని.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసిందన్నాడు శిరీష్.
తాము బావిలో పడిపోతున్నామని ఎంతోమంది సంతోష పడుతున్నా.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బయటపడ్డామన్నాడు. శిరీష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. గేమ్‌ఛేంజర్ మూవీపై కావాలని నెగెటీవ్ ప్రాపగండ చేసిందెవరు.? బ్యాడ్ పబ్లిసిటీ వెనుక ఎవరున్నారు.? నెగెటివ్ కామెంట్స్ చేసిన సినీ పెద్దలు ఎవరు.? ఇప్పుడిదే టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. ఇలా ప్రతి సినిమాకు బ్యాడ్ పబ్లిసిటీ, నెగెటివ్ టాక్ క్రియేట్ చేసుకుంటూ పోతే ఇక టాలీవుడ్ సినిమాల పరిస్థితి ఏంటన్న ఆందోళన కంటిన్యూ అవుతోంది.