Laila Teaser : విశ్వక్ సేన్ లైలా టీజర్ వచ్చేసింది..
విశ్వక్ సేన్ లైలా మూవీ టీజర్ వచ్చేసింది.

VishwakSen Laila Teaser out now
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ యమా స్పీడ్‌లో ఉన్నాడు. వరుసగా మూవీలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం లైలా. ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసింది.
ఆకాంక్ష శర్మ కథానాయిక. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. షైన్ స్క్రీన్ పిక్చర్స్, ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. వాసుదేవ మూర్తి స్క్రీన్ ప్లే అందించగా రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Daaku Maharaaj Collections : బాక్సాఫీస్ వద్ద ‘డాకు మహారాజ్’ దూకుడు.. ఐదు రోజుల్లో ఎంతంటే..?