BiggBossTelugu4 Day 3 : బిగ్‌బాస్ ఇంట్లో ఎవరా కట్టప్ప..? అందరూ అతడివైపే చూపించారు!

  • Published By: sreehari ,Published On : September 9, 2020 / 07:39 PM IST
BiggBossTelugu4 Day 3 : బిగ్‌బాస్ ఇంట్లో ఎవరా కట్టప్ప..? అందరూ అతడివైపే చూపించారు!

Updated On : September 9, 2020 / 7:52 PM IST

BiggBossTelugu4 3rd Day – Who is Kattappa in Biggboss House : బిగ్‌బాస్ ఫోర్త్‌ సీజన్‌లో రెండో ఎపిసోడ్‌ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమాలోని ఫాలోఫాలో సాంగ్‌తో ఆరంభమైంది. ఇంటి సభ్యులందరూ ఆ పాటకు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. అలాగే ఇంటిలో కట్టప్ప ఉన్నాడు.. ఆ కట్టప్ప ఎవరో తెలుసుకోవాలనే హెచ్చరిక చేస్తూ పోస్టర్లు వెలిశాయి. బిగ్‌బాస్ హౌస్‌లో ఇంటి సభ్యులు పాటించాల్సిన నిబంధనల గురించి వివరాలు చెప్పే టాస్క్‌ను కరాటే కల్యాణికి ఇచ్చారు. ఇంటి సభ్యులు తెలుగులోనే మాట్లాడాలి. ఇంటి సభ్యులు తప్పనిసరిగా మైక్ ధరించాలంటూ కొన్ని నిబంధనలు చెప్పారు. నోయల్ సీన్‌ కొన్ని జోకులు చేస్తూ ఇంటి సభ్యులను నవ్వించేందుకు ప్రయత్నించాడు.



టాస్క్‌లో భాగంగా కరాటే కల్యాణి టీచర్ అవతారం ఎత్తి మాట్లాడుతుంటే ఇంటి సభ్యులు ఆటపట్టించారు. గంగవ్వ తన మాటలతో కల్యాణికి చురకలు అంటించారు. గలగలా మాట్లాడుతూ ఇంటి సభ్యులను హుషారెత్తించింది. బిగ్‌బాస్ హౌస్‌లో గంగవ్వ వేసే కౌంటర్లు ఫుల్లుగా వినోదాన్ని పంచుతున్నాయి. గంగవ్వను అందరూ ఆప్యాయంగా చూసుకొంటూ కనిపించారు.

అరియానా,సొహెల్..  ఇంటి సభ్యులతో తేల్చుకోమన్న బిగ్ బాస్ :
సీక్రెట్ రూమ్‌లో ఉన్న అరియానా, సొహెల్ ఇంటిలోని సభ్యులకు ఫోన్ చేసి ముందు రోజు ఫుడ్ ఎవరికి పంపించారు? ఈ రోజు ఎందుకు పంపించలేదు? మీ ఇంటికి పొరుగున ఉన్న వాళ్ల గురించి ఆలోచించరా? అంటూ అరియానా గ్లోరి ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించారు. అలా వారి సంభాషణ అలా కొనసాగింది.



అయితే సీక్రెట్ రూమ్‌లో ఉన్న ఇద్దరు కలిసి ఇంటి సభ్యుల్ని చిరాకు పెట్టాలి. కానీ ఇంటి సభ్యులు వారిద్దరి సంభాషణను ఎంజాయ్ చేస్తూ.. గ్లోరి, సొహెల్‌పై విసుగు చెందుతూ ఫోన్ పెట్టేశారు.
Who is Kattappa in Biggboss House,ఇంటిలో కట్టప్ప ఎవరు అనే విషయంపై చిన్న టాస్క్‌ను బిగ్‌బాస్ ఇచ్చారు. ఇంటి సభ్యుల్లో ఎవరినైతే కట్టప్పగా భావిస్తారో… వారి పేరును ఓ పేపర్‌పై రాసి అక్కడే ఉన్న బాక్స్‌లో వేశారు. ఆ తర్వాత ఆ బాక్స్‌ను ఇద్దరు ముసుగు వీరులు వచ్చి తీసుకెళ్లారు. దాంతో కట్టప్ప ఎవరు అనే టాస్క్ ముగిసింది. అయితే కట్టప్ప ఎవరు అనే పోటీలో… అఖిల్‌ పేరును ఎక్కువ మంది సూచించారు. సెకండ్‌ ఎపిసోడ్‌లోనూ కరాటే కల్యాణికి పలువురితో గొడవలు జరిగాయి.



నన్నే ఎందుకు టార్గెట్.. కల్యాణి ఆగ్రహం :
ఇంట్లో మోనాల్, నోయల్ సీన్, అభిజిత్, గంగవ్వ కూర్చొని మాట్లాడుతుండగా కరాటే కల్యాణి ఇబ్బందికి గురైంది. అభిజిత్ ఏదో అనడంతో నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటూ గరం అయ్యింది. దాంతో అభిజిత్‌తోపాటు అందరూ విస్తుపోయారు. ఆ తర్వాత అక్కడి నుంచి కోపంతో కల్యాణి వెళ్లిపోయింది. ఆ తర్వాత అభిజిత్ వచ్చి కల్యాణితో మాట్లాడి.. తనకు ఎలాంటి కోపం లేదని విషయాన్ని చెప్పడంతో వారి మధ్య గొడవకు పుల్‌స్టాప్ పడింది.