Tollywood : కొత్త ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎవరు? తలసాని, KTRలా సినీ పరిశ్రమతో క్లోజ్‌గా ఉండేదెవరు?

అయితే కాంగ్రెస్ విజయం, ప్రభుత్వ మార్పుతో సినీ పరిశ్రమలో కూడా చర్చలు మొదలయ్యాయి. ఇకపై సినీ పరిశ్రమ ఎలా ఉండనుంది? సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారాలు ఎలా ఉండనున్నాయి? సినిమాటోగ్రఫీ మినిష్టర్ ఎవరు?

Tollywood : కొత్త ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎవరు? తలసాని, KTRలా సినీ పరిశ్రమతో క్లోజ్‌గా ఉండేదెవరు?

Who is New Telangana Cinematography Minister Talk goes viral in Tollywood

Tollywood : తెలంగాణ(Telangana) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. కాంగ్రెస్(Congress) పార్టీ విజయ ఢంకా మోగించింది. తెలంగాణకు కొత్త సీఎం, కొత్త ప్రభుత్వం కూడా కొలువుదీరబోతుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నాయకులకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే కాంగ్రెస్ విజయం, ప్రభుత్వ మార్పుతో సినీ పరిశ్రమలో కూడా చర్చలు మొదలయ్యాయి. ఇకపై సినీ పరిశ్రమ ఎలా ఉండనుంది? సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారాలు ఎలా ఉండనున్నాయి? సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎవరు? ఇకపై అయినా నంది అవార్డులు ఇస్తారా.. అని పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో సినీ పరిశ్రమకు మంచి జరిగిందనే చెప్పొచ్చు. KTR ఎక్కువగా సినీ ప్రముఖులతో క్లోజ్ గా ఉండటం వల్ల సినిమా వాళ్లకు కావాల్సిన పనులు జరిగాయని, కరోనా సమయంలో కూడా సినీ పరిశ్రమకు, సినీ కార్మికులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగానే నిలబడిందని చెప్పొచ్చు. సినీ పరిశ్రమలో ఏదైనా సమస్యలు ఉన్నా KTR తో కానీ, ఇన్నాళ్లు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న తలసానితో కానీ డైరెక్ట్ గా చర్చించేవాళ్ళు. ఇక తలసాని శ్రీనివాస యాదవ్ అయితే సినీ పరిశ్రమకు చెందిన ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారు. ఏ సినిమా ఈవెంట్ కి పిలిచినా తలసాని, KTR అతిథులుగా వచ్చేవారు.

KTR, తలసాని ఇద్దరూ ఆల్మోస్ట్ అందరు సినీ ప్రముఖులతో టచ్ లో ఉండేవారు. సీరియల్, టీవీ నటులు, యాంకర్స్, సోషల్ మీడియా స్టార్స్ తో కూడా అప్పుడప్పుడు కలిసి వారికి ఇంటర్వ్యూలు ఇచ్చి, వారు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరోనా సమయంలో నాగార్జున, చిరంజీవి డైరెక్ట్ గా KCR ని కలిసి తమ సమస్యలని చెప్పుకున్నారు. సినీ పరిశ్రమలో ఎవరైనా ప్రముఖులు మరణించినా KTR, తలసాని కచ్చితంగా వచ్చి నివాళులు అర్పించారు. టికెట్ల రేట్లు, షూటింగ్ పర్మిషన్స్.. ఇలాంటి వాటన్నిటికీ KTR, తలసాని దగ్గరుండి సహకరించారు. తెలంగాణ ఏర్పడ్డాక హైదరాబాద్ ని, తెలంగాణని ప్రమోట్ చేస్తూ చాలా సినిమాలు కూడా వచ్చాయి. ఇటీవల తెలుగు సినీ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. తెలంగాణలో చాలా చోట్ల షూటింగ్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్ మాత్రమే కాక వేరే జిల్లాలు, ఊర్లల్లో కూడా షూటింగ్స్ జరుగుతున్నాయి.

సినీ పరిశ్రమ కూడా ప్రభుత్వానికి మంచి ఆదాయ వనరు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారనుండటంతో కాబోయే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు? సినీ పరిశ్రమ సమస్యలు ఎవరు వింటారు? సినిమా వాళ్ళతో ప్రభుత్వం తరపున ఎవరు మాట్లాడతారు అనే సందేహాలు టాలీవుడ్ లో వస్తున్నాయి. ఇవాళ లేదా మరో మూడు నాలుగు రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ కేబినెట్ ఏర్పడనుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు అనేది టాలీవుడ్ లో చర్చగా మారింది. ఎవరు వస్తారు? కాంగ్రెస్ లో సినిమా వాళ్ళతో బాగా క్లోజ్ గా ఉన్న నేతలు ఎవరు? సినిమా వాళ్ళతో ఎవరు చర్చలు జరుపుతారు అని చర్చలు జరుగుతున్నాయి.

సినీ పరిశ్రమ నుంచి నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ముందు నుంచి కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉన్నారు. కానీ బండ్లన్న పోటీ చేయలేదు. సినిమాటోగ్రఫీ మంత్రి బండ్లన్నకి ఇవ్వకపోయినా ఏపీలో పోసాని, అలీకి ఇచ్చినట్టు ఏవైనా స్పెషల్ పదువులు సినిమా, మీడియా రంగానికి చెందినవి ఇచ్చే అవకాశం ఉండొచ్చు. అలాగే గతంలో చిరంజీవి కాంగ్రెస్ లో ఉండటంతో చిరంజీవికి కాంగ్రెస్ వారితో సత్సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం సినీ పరిశ్రమ పెద్దగా చిరంజీవి ఏదైనా సమస్య వస్తే ముందుండి మాట్లాడుతున్నారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ రావడంతో చిరంజీవి మరింత ముందుండి సినీ పరిశ్రమ సమస్యలని కాంగ్రెస్ ప్రభుత్వానికి వినిపిస్తారని, టాలీవుడ్ కి కావాల్సినవి అన్ని చేయిస్తారని కూడా పలువురు అనుకుంటున్నారు.

Also Read : Nikhil Siddhartha : ప్రజాస్వామ్యం బతికే ఉంది.. రేవంత్ రెడ్డి అన్న‌కు శుభాకాంక్ష‌లు : హీరో నిఖిల్‌

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడటం టాలీవుడ్ లో కూడా ఆసక్తిగా, చర్చగా మారింది. మరి తెలంగాణ కొత్త సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు? సినీ పరిశ్రమతో క్లోజ్ గా ఉండి సహకరించే నాయకులు ఎవరో తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కాంగ్రెస్ కి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు.

Also Read : RGV – KTR : కేటీఆర్ పై ఆర్జీవీ ప్రశంస.. నేనెప్పుడూ మీలాంటి లీడర్‌ని చూడలేదు..

తాజాగా అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కూడా మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం సంతోషంగా ఉంది. సినీ పరిశ్రమను ఆదుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త కాదు. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు సినీ పరిశ్రమను ఎంతో ప్రోత్సహించాయి. ఈ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తుందనుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం. త్వరలోనే సినీ పరిశ్రమ తరపున కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలుస్తాం అని కూడా అన్నారు. మరి ఈసారైనా గత కొన్నేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డుల పై స్పందించి మొదలుపెడతారేమో చూడాలి.