Bigg Boss 5 : ఈ సారి బిగ్ బాస్ కెప్టెన్ ఎవరు??

ప్రస్తుతం బిగ్ బాస్ లో 'రాజ్యానికి రాజు ఒక్కడే' అనే టాస్క్ జరుగుతుంది. దీని నుంచి ఈ వారం కెప్టెన్ కి ఎవరు పోటీ పడతారో డిసైడ్ చేస్తారు. మొన్నటి ఎపిసోడ్ లో సన్నీ, రవి మధ్య పోటీ

Bigg Boss 5 : ఈ సారి బిగ్ బాస్ కెప్టెన్ ఎవరు??

Bb (1) (1)

Updated On : October 8, 2021 / 7:25 AM IST

BiggBoss 5 :  ప్రస్తుతం బిగ్ బాస్ లో ‘రాజ్యానికి రాజు ఒక్కడే’ అనే టాస్క్ జరుగుతుంది. దీని నుంచి ఈ వారం కెప్టెన్ కి ఎవరు పోటీ పడతారో డిసైడ్ చేస్తారు. మొన్నటి ఎపిసోడ్ లో సన్నీ, రవి మధ్య పోటీ ఆసక్తికరంగా జరిగింది. నిన్న బిగ్‌బాస్‌ ఫైనల్‌గా రాజులు, వాళ్ళ రాజ్యంలోని ప్రజల దగ్గర ఉన్న నాణాలను ఎన్ని ఉన్నాయో చెప్పమన్నాడు. ఆ తర్వాత కంటెస్టెంట్లు ప్రస్తుతం ఉన్న వారి రాజుకు సపోర్ట్‌ ఉపసంహరించుకోవచ్చు, వేరే రాజుకు మద్దతు కూడా తెలపచ్చు అన్నాడు బిగ్ బాస్. మొత్తంగా అన్ని టాస్క్‌లు ముగిసే సరికి సన్నీ దగ్గర ఆరుగురు, రవి దగ్గర ఏడుగురు ప్రజలు ఉన్నట్లు కెప్టెన్‌ శ్రీరామ్‌ బిగ్‌బాస్‌కు తెలిపాడు. దీంతో ఎక్కువ ప్రజలు కలిగి ఉన్నందున రవికి బిగ్ బాస్ రాజ్యానికి రాజు అని ప్రకటించి పట్టాభిషేకం జరిపించాడు బిగ్ బాస్. రవి గెలవడంతో ఇంకో రాజ్యం ప్రజల ధనాన్ని స్వాధీనం చేసుకునే అవకాశాన్ని రవికి కల్పించాడు బిగ్‌బాస్‌. దీంతో జెస్సీ, షణ్మఖ్‌, సిరి, కాజల్‌లు కష్టపడి దొంగిలిచిన నాణాలు కూడా రవి వశమయ్యాయి.

అంతే కాక ఈ సారి రవి రాజుగా గెలవడంతో కెప్టెన్సీకి పోటీ పడటానికి నేరుగా అర్హత సాధించాడు. అంతే కాక రవి రాజ్యంలోని మరో ముగ్గురు ప్రజల్ని కూడా కెప్టెన్సీకి పోటీ చేయాలనీ బిగ్ బాస్ ఆదేశించాడు. ఆ ముగ్గుర్ని రవిని సెలెక్ట్ చేయమన్నాడు. రవి తన వైపు ఉన్న వాళ్లలో యానీ మాస్టర్‌, హమీదా, శ్వేతలను కెప్టెన్సీ పోటీదారులుగా ప్రకటించాడు.

Manchu Vishnu : ‘మా’ సభ్యులకు మంచు విష్ణు వరాలు.. రాజకీయ నాయకులని మించి..

అయితే ఈ సీజన్‌ మొత్తానికి కెప్టెన్‌ అయ్యే అర్హతను కోల్పోయిన ప్రియకు కెప్టెన్‌ అయ్యే అవకాశాన్ని కల్పించాడు బిగ్ బాస్. తను రవి రాజ్యంలో ఉంది కాబట్టి రవి చెప్పిన ముగ్గురిలో ఎవరైనా తప్పుకొని ప్రియకి ఛాన్స్ ఇవ్వొచ్చు అని బిగ్ బాస్ తెలిపాడు. దీంతో కెప్టెన్సీ కంటెండర్స్‌ పోటీ నుంచి హమీదా వెనక్కి తగ్గి తన స్థానాన్ని ప్రియకు ఇచ్చింది. ప్రియ కెప్టెన్సీ పోటీలో నిలిచినందుకు చాలా సంతోషించింది. మరి వీళ్లల్లో నెక్స్ట్ బిగ్ బాస్ కెప్టెన్ ఎవరో చూడాలి.